Teachers Association( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Teachers Association: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి!

Teachers Association: వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డాక్టర్ గడ్డం కృష్ణయ్య తెలియజేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం బీసీ టీచర్స్ అసోసియేషన్(BC Teachers Association) నూతన అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఒక బుద్ధి జీవుల సమూహంగా దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ గా కృషి చేస్తామని తెలియజేసినారు. దేశంలో రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థలలో వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఒక బలమైన అసోసియేషన్ గా భవిష్యత్తులో పనిచేస్తామని తెలియజేసినారు.

 Also Raad: Vinayaka Chavithi 2025: ఇవాళ ఒక్క రోజు వర్షాన్ని ఆపు గణపయ్యా.. అంటూ వేడుకుంటున్న భక్తులు

బీసీ టీచర్స్ అసోసియేషన్ ని ఏర్పాటు

44 మంది కార్యవర్గంతో కాకతీయ విశ్వవిద్యాలయం బీసీ టీచర్స్ అసోసియేషన్ ని ఏర్పాటు చేశాం ఆగస్టు 30 నాడు మానవీయ శాస్త్రాల భవనంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా డాక్టర్ తండు నాగయ్య ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ బ్రహ్మయ్య, ట్రెజరర్ గా డాక్టర్ బి సతీష్, ఇతర కార్యవర్గ సభ్యులుగా వివిధ హోదాలలో డాక్టర్ రాధిక డాక్టర్ సునీత డాక్టర్ కవిత డాక్టర్ విజయకుమార్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ డాక్టర్ బూర శ్రీధర్ డాక్టర్ శ్యాంసుందరా చారి పాల్గొన్నారు.

వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన కార్యవర్గానికి కాకతీయ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్ డాక్టర్ చిర్రా రాజు గౌడ్ బీసీ సెల్ మాజీ డైరెక్టర్ ఆకుతోట శ్రీనివాస్ బీసీ నాయకులు డాక్టర్ తిరునహరి శేషు అభినందనలు తెలియజేసినారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన 56 శాతం పరిపాలన పదవులు కేటాయించాలని కార్యవర్గం తీర్మానం చేసినది.

 Also Read: Bhukya Murali Naik: రైతులకు సరిపడా యూరియా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం