Bhukya Murali Naik: తెలంగాణ రైతులకు గత 70 ఏళ్లుగా యూరియను కొరత లేకుండా అందించిన కాంగ్రెస్ పార్టీ పై గత పదిహేళ్లుగా పాలించిన బీఆర్ఎస్(Brs) పార్టీ విమర్శలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందనీ మహబూబాబాద్ ఎమ్మెల్యే డా” భూక్య మురళి నాయక్ ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఓ ప్రకటనను ఎమ్మెల్యే మురళి నాయక్ విడుదల చేశారు. ప్రతి రైతుకు యూరియా అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు..కేంద్రం మెడలు వంచి అయిన యూరియా తీసుకొస్తానని అన్నారు.
Also Read: Medchal Police: 4 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. సినిమా రేంజ్‌లో ఛేదించిన పోలీసులు.. ఎలాగంటే?
యూరియా కొరత చాలా ఉంది
ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని, అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ రఘునందన్ రావు(Raghunandan Rao) ను కలిసినా మహబూబాబాద్ ఎమ్మెల్యే డా”భూక్యా మురళి నాయక్(Bhukya Murali Naik) నియోజకవర్గం లో యూరియా కొరత చాలా ఉందని రైతులు బాగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. దీంతో దానికి స్పందించిన ప్రభుత ఉన్నత అధికారులు మరియు ప్రభుత్వ సలహాదారుడు చర్చించి ఈ నెల 28వ తేదీ నాటికి మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు యూరియా సరిపడ అందుతుందని ఎమ్మెల్యే డా భూక్యా మురళి నాయక్ కి హామీ ఇచ్చారు. రైతులు అధైర్య పడవద్దు రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండ ఉండాలి.ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని గుర్తు చేశారు.
Also Read: Tollywood Actors: అందులో టాలీవుడ్ హీరోలే టాప్.. అది సార్ మన బ్రాండ్