Tollywood Actors: అందులో టాలీవుడ్ హీరోలే టాప్..
mahesh-babu( image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Tollywood Actors: అందులో టాలీవుడ్ హీరోలే టాప్.. అది సార్ మన బ్రాండ్

Tollywood Actors: పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హీరోల హవా పెరుగుతోంది. దాదాపు టాప్ హీరోలు అందరూ వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో ఉన్నవారే, ప్రభాస్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఇలా అందరూ వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో ఉన్నవారే ప్రస్తుతం మహేష్ బాబుతో వస్తున్న సినిమా బడ్జెట్టే దాదాపు వెయ్యి కోట్లు అంటే టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరూ ఇండియన్ సినిమాను శాసించే వారే. అయితే తాజాగా వారు వాడే వైనిటీ వాన్‌ ల గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే అందులో టాలీవుడ్ (Tollywood Actors)టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు భారతదేశంలో అత్యంత ఖరీదైన వైనిటీ వాన్‌ను కలిగి ఉన్నారు. ఈ వాన్ ధర సుమారు 8 కోట్ల రూపాయలు కాగా, దాని ఇంటీరియర్‌ల కోసం మరో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.

Read also-Sand Mining Scam: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

అల్లు అర్జున్ అయితే తన వైనిటీ వాన్‌ను చాలా అపురూపంగా చూసుకుంటారు. దానికి “ఫాల్కన్” అని పేరు కూడా పెట్టారు. ఇక దాని ధర అయితే సుమారు 7 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇంతటి ఖరీదైన వైనిటీ వ్యాన్‌లు కలిగి ఉన్న ఒక్క టాలీవుడ్ హీరోలు మాత్రమే. బాలీవుడ్ నుంచి అత్యంత ఖరీదైన వైనిటీ వ్యాన్ కలిగి ఉన్న హీరోగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. అయన కలిగి ఉన్న వైనిటీ వాన్ విలువ 4-5 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఇండియాలో అత్యంత ఖరీదైన వైనిటీ వ్యాన్ లను కలిగి ఉన్నది టాలీవుడ్ హీరోలే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

ఈ పోస్టును చూసిన నెటిజన్లు మాత్రం వారికి నచ్చిన తీరులో వారు స్పందిస్తున్నారు. కొందరు అయితే పవన్ కళ్యాణ్ రైతుల కోసం 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. కనీసం మీ అభిమానులకు మీరు ఏం ఇచ్చారు అని కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్, మహేష్ అభిమానులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ వైనిటీ వ్యాన్ లు వారి సౌకర్యానికి సంబంధించినవి వాటిపై ఇలా కామెంట్లు చేయడం సబబు కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా స్థాయిలో ప్రతి విషయంలోనూ ముందు ఉండటం వారి అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం.

Just In

01

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!