Vinayaka Chavithi 2025: వినాయక చవితిని గణేశ చతుర్థి అని కూడా పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథినాడు జరుపుకుంటారు. 2025లో, ఈ పండుగ ఆగస్టు 27 న ప్రారంభమయ్యి సెప్టెంబర్ 6, శనివారం నాడు వినాయక నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ పండుగ విఘ్నేశ్వరుడి జన్మదినంగా జరుపుకుంటారు. ఆయన విఘ్నాలను తొలగించి, జ్ఞానం, శ్రేయస్సు, విజయాన్ని ప్రసాదించే దేవుడిగా పూజింపబడతాడు. ఈ పండుగ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మరియు గోవా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.
వర్షాల ఆటంకంతో వినాయక చవితి పండుగ వినాయక చవితి పండుగ సన్నాహాలకు పెను సవాలుగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా వినాయకుడి ప్రతిమల స్థాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహించడంలో భక్తులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీధుల్లో నీరు నిలిచిపోవడం, రవాణా సమస్యలు, పందిళ్ల నిర్మాణంలో ఆటంకాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. “ఇవాళ ఒక్క రోజు వర్షాన్ని ఆపు గణపయ్యా” అని భక్తులు గణేశుడిని ప్రార్థిస్తూ, పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇంకో వైపు కొందరు ఏ పనులు ముందుకు వెళ్ళడం లేదని లబోదిబో అంటున్నారు. భక్తులు వినాయక చవితి సందర్భంగా సాంప్రదాయ ఆచారాలను కాపాడుకోవడానికి, వర్షం తగ్గే వరకు ఆశాభావంతో ఎదురుచూస్తూ, గణేశుడి ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
