Collector Harichandana (imagecredit:swetcha)
హైదరాబాద్

Collector Harichandana: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana: మట్టి గణపతి విగ్రహాలను పూజించి, కాలుష్యాన్ని నివారించుకుందామని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి(Collector Harichandana Dasari) పిలుపునిచ్చారు. షేక్ పెట్ లోని వివేకానంద కాలనీలో షేక్ పేట్ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో వినాయక చతుర్దతి సందర్భంగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్స్ (మట్టి విగ్రహాలు ) పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు కాలుష్య ప్రభావాలు, సరస్సులు కాపాడుకోవడం, మన భవిష్యత్తును, పర్యావరణ పరిరక్షణపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి మార్పు తీసుకువచ్చే లక్ష్యాన్ని వివరించారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పీఓపీ విగ్రహాలు బాగా తగ్గి, మట్టి విగ్రహాలను పెంచే అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) ద్వారా ఒక లక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా లక్ష విగ్రహాలు, హెచ్ఎండీఏ(HMDA) ద్వారా లక్ష విగ్రహాలను పంపిణీ చేసినట్లు వివరించారు. అలాగే జిల్లాలోని 40 కు పైగా బీసీ సొసైటీలలో గల కుమ్మరిలు, శాలివాహనుల ఆధ్వర్యంలో జిల్లాలోని రైతు మార్కెట్లలో మట్టి విగ్రహాలను విక్రయించటం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Also Read: Cocaine Seized: కొకైన్ తరలిస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్.. ఎక్కడంటే?

పండుగ శుభాకాంక్షలు

తదుపరి కాలనీలోని రహదారిని, చెరువును ఆమె పరిశీలించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పూస చరణ్ కుమార్(Cheran Kumar) మాట్లాడుతూ ఫోరం ద్వారా ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ కి వివరించగా, ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఆ తర్వాత విద్యార్థులకు, ప్రాంత వాసులకు వినాయక విగ్రహాలను అందచేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జి ఆశన్న, కాలుష్య నియంత్రణ బోర్డు ఈ ఈ సురేష్, నిర్వాహకులు, ప్రాంతవాసులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు