Mahabubabad: తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కుంభం యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బిర్రు వెంకటనారాయణ, కోశాధికారిగా ముంజాల యాకయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులుగా భూక్య మురళి నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రేషన్ డీలర్లకు ఐదు నెలల కమీషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేందుకు కృషి చేయాలి అన్నారు. ఎన్నికల ముందు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం 5000 రూపాయలు, పెంటాకు 300 రూపాయల కమిషన్ పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: Divya Bharathi: దివ్యభారతి నా గదిలోకి వచ్చి ఏం చేసిందంటే? నిర్మాత పహ్లాజ్ నిహలానీ షాకింగ్ కామెంట్స్!
హమాలి చార్జీలు ఇచ్చుకోలేని పరిస్థితి
సెప్టెంబర్ లో బియ్యం దిగుమతి చేసుకునేందుకు హమాలి చార్జీలు ఇచ్చుకోలేని పరిస్థితి డీలర్లకు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా రేషన్ షాపుల రూమ్ కిరాయిలను కూడా చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. డీలర్ల దుస్థితిపై స్పందించి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల మేనిఫెస్టో హామీలను నెరవేర్చాలి
2023 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో డీలర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రేషన్ డీలర్లకు ఐదువేల రూపాయలు గౌరవ వేతనం, క్వింటాకు 300 రూపాయల కమిషన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. కమిషన్, గౌరవ వేతనం విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో డీలర్లు మొత్తం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ ఐదున రాష్ట్ర వ్యాప్త రేషన్ షాపులు ఒకరోజు బంద్ పిలుపు నేపథ్యంలో ముందస్తుగా కమిషనర్ కు తెలియజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ ఐదున మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులు బందు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలన అధికారి పవన్ కుమార్ కు వినతి పత్రం అందించారు.
Also Read: RTC Conductor: ఏపీ బస్సుల్లో నయా మోసం.. పురుషులకు స్త్రీ శక్తి ఉచిత టికెట్లు.. ఇదేందయ్యా ఇది!