Mahabubabad District: అన్నదాతలకు అనుకోని కష్టాలు మొదలయ్యాయి. యూరియా(Urea) కోసం రైతుల అవస్థలు అంతా ఇంతా కాదు. తమ సాగు పనులు వదిలీ రైతులు తెల్లవారుజాము నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చెప్పులతో క్యూలైన్ లు కట్టి, పుస్తకాలతో బారులు తీరి ఒక్క బస్తా యూరియా కోసం నానా వ్యవస్థలు పడ్డ రైతులు(Farmers) కేసముద్రం మండల కేంద్రంలో రైతులు(Farmers) రోడ్డెక్కి, ఆందోళన బాట పట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, కేసముద్రం మండల కేంద్రానికి రైతు వేదిక వద్ద రైతన్నలు ఉదయం 4 గంటల నుండి యూరియా కోసం రైతులు చెప్పులను క్యూ లైన్ లో పెట్టారు.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు
ఒక్కసారిగా మండలంలో ఉదయం తేలికపాటి వర్షం కురవడంతో యూరియా అందకపోవడంతో రైతన్న(Farmers)లు కేసముద్రం, తొర్రూరు వెళ్లే ప్రధాన రదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కేసముద్రం ట్రైన్ ఎస్సై కర్ణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని దాదాపుగా మండలంలో సకాలంలో యూరియా సరఫరా జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను గౌరవించి సహకరించినట్లయితే ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి పంపిణీని ప్రశాంతంగా జరిగేటట్లుగా చూస్తామని, రైతన్న(Farmers) లు సహకరించాలని కోరారు. సరైన సమయానికి యూరియా అందించాలి. పరుపాటి సంజీవరెడ్డి రైతు సంఘం సభ్యుడు డిమాండ్ చేశారు.
సరైన సమయానికి యూరియా అందించాలి
సంజీవరెడ్డి రైతు సంఘం సభ్యుడు
గత నెల రోజుల నుండి యూరియా కోసం రైతులు(Farmers) నానా అవస్థలు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలను యూరియా(Urea) కొరత కష్టాలతో పాటు పంట నష్టాలను కూడా చేపడుతున్నాయి. ఎన్నికల సమయంలోనే పలు పార్టీలకు రైతులు గుర్తుకు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతి రైతుకు యూరియా కొరత లేకుండా చూడాలని అన్నారు.
నానో యూరియా స్ప్రే చేయడం ఉత్తమం
ఏవో భూక్య మహేందర్..
యూరియా(Urea)రావట్లేదని ఆందోళన చేపట్టి ఘర్షణలకు పాల్పడకండి. వివిధ పంటలు వేసుకున్న రైతులు 500 ఎం.ఎల్ నానో యూరియా బాటిల్ 10 లీటర్లకు 100 ఎమ్మెల్ చొప్పున వాడినట్లయితే దాని ఏమైనా దిగుబడికి తోడ్పడుతుంది. యూరియా కొరకు ఆశించి పంట నష్టం చేసుకోకూడదని తెలిపారు.
Also Read: Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు