Urea Shortage( IMAGE credit: twitter or free pic)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు

Urea Shortage: రైతన్నను యూరియా కొరత వేధిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా(Urea) రాష్ట్రానికి సరఫరా రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో పాసుబుక్కులు, చెప్పులు ఇలా ఏది కనిపిస్తే దానిని రైతులు(Farmers) పెడుతున్నారు. సహకారసంఘాలు, ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద. అగ్రోస్ దగ్గర రైతులు(Farmers) తీసుకుంటున్నారు. ఎరువులు సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నికావు. కొన్ని సహకారసంఘాల వద్ద పోలీసులను పెట్టి రైతులకు యూరియాను అందజేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు ఎరువుల దుకాణదారులు మాత్రం యూరియాకు మరో పెరుగుల మందును అంటగట్టి మరీ విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కేంద్రం తెలంగాణకు కేటాయించిన విధంగా ఎరువులు సరఫరా చేయాలని విజ్ఞప్తు చేస్తుంది. ఒకవైపు లేఖలు.. మరోవైపు కేంద్రమంత్రులను ఎరువులు అందజేయాలని కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఆశించిన స్పందన కరువైందని, ఎరువుల సరఫరాలో వివక్షను చూపుతూనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నారు. కేంద్రం ఈ వానాకాలం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసింది. 2.69 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పండింది.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేటాయించిన 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా(Ureaలో స్వదేశీ యూరియా 4.34 లక్షల మెట్రిక్ టన్నులు, దిగుమతి యూరియా 3.96 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇందులో స్వదేశీ యూరియాలో 3.27 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, దిగుమతి యూరియాలో 2.05 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. ఏప్రిల్ లో 1.7, మే లో 1.6, జూన్ లో 1.7, జులైలో 1.6, ఆగస్టులో 1.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించి, ఏప్రిల్ లో 1.21, మేలో 0.88, జూన్ లో 0.98, జులై లో 1.43, ఆగస్టులో 0.82 లక్షల మెట్రిక్ టన్నులు అని రాష్ట్ర వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

రైతులకు యూరియా కొరత

కేంద్రంసైతం పార్లమెంట్ వేదిక రాష్ట్రానికి ఈ వానాకాలం కేటాయించిన యూరియా వివరాలను వెల్లడించింది. 2025-26 సంవత్సరానికి 9.80లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేటాయించాల్సి ఉండగా, ఏప్రిల్ లో 0.15మెట్రిల్ టన్నులు, మేలో 0.31 మెట్రిక్ టన్నులు, జూన్ లో 1.44లక్షల మెట్రిక్ టన్నులు, జూలైలో 3.43 లక్షల మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 1.42లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ఇప్పటివరకు మొత్తం 6.75లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినట్లు పేర్కొంది. అంటే కేంద్ర లెక్కల ప్రకారం 3.05లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈనెల 17వ తేదీవరకు తెలంగాణకు తక్కువ కేటాయించినట్లు స్పష్టం చేసింది. దీంతో రైతులకు యూరియా కొరత ఏర్పడిందనేది స్పష్టమవుతోంది.

కేంద్రంపైనే ఆశలు..
రాష్ట్రానికి ఆగస్టు నెలకు కేటాయించిన దిగుమతి యూరియా(Urea) సరఫరా కోసం వచ్చే 4 నౌకలు ఈ నెలాఖరు వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి నౌక నుంచి అదనంగా 20 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించే విధంగా కేంద్రానికి లేఖలు రాయబోతున్నారు. అయితే కేంద్రం కేటాయించిన యూరియా(Urea) ఇంకా 3.05లక్షల మెట్రిక్ టన్నులులోటు ఉంది. అయితే కేంద్రం స్పందిస్తుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు స్పందిస్తారా? లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి తుమ్మల తప్పుబడుతున్నారు. లెక్కలతో సహా వివరిస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ నేతల వాదనలకు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు పొంతనలేదు.

టాస్క్‌ఫోర్స్‌ బృందాలు
రాష్ట్రంలో హోల్ సేల్, రిటైల్ డీలర్లు యూరియా (Urea)దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు యూరియా(Urea)కు ఏదేనీ కంపెనీకి చెందిన మందును గానీ, ఇతర ఫెర్టిలైజర్ ను గానీ లింకు పెట్టి అమ్ముతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు అధిక ధరలకు విక్రయం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కు తరలింపు, అక్రమరవాణా చేస్తున్నారనే సమాచారంతో ప్రభుత్వం అలర్టు అయింది. అన్ని శాఖల అధికారులతో ట్రాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి

ఈ బృందాలు హోల్ సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారి యూరియా స్టాక్ ను పర్యవేక్షించనున్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. అధిక ధరలకు విక్రయించే లేదా ఇతర ఉత్పత్తులతో కట్టిపెట్టే ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోనున్నారు. పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశమున్న యూనిట్లపై తనిఖీలు చేసి, వారి ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి, ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్ , యూనిట్‌పై కేసులు నమోదు చేయనున్నారు.

యూరియా(Urea) వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రతి నెల టాప్ 20 కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను (dbtfert.nic.in) వెబ్‌సైట్‌లో తనిఖీ చేయనున్నారు. రైతులకు యూరియా(Urea)ను మితంగా ఉపయోగించాలని, నానో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, బయో-ఫెర్టిలైజర్స్ వంటివి వినియోగించమని ప్రోత్సహించేలా వ్యవసాయాధికారులు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులకు కొంతమేర ఉపశమనం కలుగనుంది.

 Also Read: Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..