Hydraa: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు సమీపంలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఆక్రమణలకు గురైన భూమిని హైడ్రా(Hydraa) కాపాడింది. సుమారు 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ. కోట్ల వరకు ఉంటుందన్న అంచనాలున్నాయి. రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన భూమికి ఎట్టకేలకు హైడ్రా విముక్తి కల్పించింది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ(Jubilee Hills Cooperative Housing Society)కి సంబంధించిన ఈ భూమి లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించి కేటాయించినట్లు గుర్తించారు. పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించి, ఫేక్ ఇంటి నంబరు క్రియేట్ చేసి అందులో నర్సరీ నడుపుతున్నట్లు గుర్తించారు. ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.
జీహెచ్ఎంసీ(GHMC) పలుసార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా, ఆక్రమణకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించి స్టేటస్‌కో తెచ్చుకుని తప్పించుకుంటున్నట్లు హైడ్రా వెల్లడించింది. స్టేటస్‌కో ఉంఢగా, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, నర్సరీ నడపరాదని, అక్కడ అనుమతి లేని షెడ్డుల నిర్మాణాలు, నర్సరీ వ్యాపారాన్ని అక్రమగా నిర్వహించినట్లు హైడ్రా వెల్లడించింది.
ప్రజావాణిలో ఫిర్యాదుతో కబ్జా వెలుగులోకి
జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు అందటంతో ఈ కబ్జా వెలుగులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్9AV Ranganadh) ఆదేశాలతో హైడ్రా అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. లే ఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంగా నిర్ధారించారు. నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు హైడ్రా నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నోటీసులపై తిరిగి హైకోర్టును ఆశ్రయించిన సత్యనారాయణకు అక్కడ చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేటస్‌కోను కూడా కొట్టేసి, హైడ్రా తీసుకోబోయే చర్యలకు హైకోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఉదయం రంగంలో దిగిన హైడ్రా ఆక్రమిత స్థలంలో కూల్చివేతలు చేపట్టి, ఆ భూమిని కబ్జాల నుంచి విడిపించింది.
నర్సరీలో మొక్కలను తరలించుకునేందుకు అవకాశమిచ్చి, అక్కడ షెడ్డులతో పాటు ఆక్రమణలను తొలగించింది. దీంతో 2 వేల గజాల స్థలంలో హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు కూడా పెట్టింది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు రవీంద్రనాద్‌తో పాటు పాలకమండలి సభ్యులు హైడ్రా యాక్షన్ పై సంతోషం వ్యక్తం చేశారు. సుధీర్ఘంగా తాము చేస్తున్న న్యాయపోరాటం ఫలించిందని పేర్కొన్నారు. రూ. వంద కోట్ల ల్యాండ్ ను కబ్జాదారుల నుంచి విడిపించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి , హైడ్రా కు, జీహెచ్ఎంసీ అధికారులకు సొసైటీ ప్రెసిడెంట్ తో పాటు పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: MD Ashok Reddy: ఏఐతో మరింత వేగంగా సమస్యల పరిష్కారం: ఎండీ అశోక్ రెడ్డి