MD Ashok Reddy (imagecredit:swetcha)
హైదరాబాద్

MD Ashok Reddy: ఏఐతో మరింత వేగంగా సమస్యల పరిష్కారం: ఎండీ అశోక్ రెడ్డి

MD Ashok Reddy: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాలో లోపాలు, తరుచూ ఒకే అంశానికి సంబంధించి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం కోసం జలమండలి అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Water Authority Artificial Intelligence) ను వినియోగించుకునేందుకు సిద్దమైంది. తాగునీటి స‌ర‌ఫ‌రా, మురుగునీటి నిర్వ‌హ‌ణ‌, అధునాత‌న సాంకేతికత వినియోగంతో దేశంలో ఇత‌ర బోర్డుల కంటే మరింత మెరుగైన సేవలందించాలని జలమండలి భావిస్తుంది. జలమండలి గత సంవత్సర కాలంలో మెట్రో కస్టమర్ కేర్(ఎంసీసీ)లో నమోదైన ఫిర్యాదులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా కొన్ని రోజులుగా ఐటీ విభాగపు అధికారులు విశ్లేషిస్తున్నారు. గత సంవత్సర కాలంలో ఎంసీసీలో నమోదైన ఫిర్యాదులను, ట్యాంకర్ బుకింగ్ వివరాలను ఏఐ సాంకేతికత సాయంతో ఏయే అంశాలపై, సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయో? ఏయే ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయి? తరుచూ నమోదవుతున్న ఫిర్యాదులను వివిధ కోణాల్లో విశ్లేషిస్తూ వాటి సత్వర పరిష్కారానికి అత్యుత్తమమైన మార్గాన్ని జలమండలి సమకూర్చుకుంది.

వివిధ సమస్యలపై ఫిర్యాదులు

అలాగే, గత సంవత్సర కాలంగా ట్యాంకర్ బుకింగ్ ల వివరాలతో ఏయే డివిజన్ లో అత్యధికంగా బుకింగ్ లు వస్తున్నాయి? ఏయే ప్రాంతాలతో పాటు అత్యధికంగా ట్యాంకర్ లను బుక్ చేసిన వినియోగదారుల వివరాలను సైతం ఏఐ సహాయంతో జాబితాలను సిద్దం చేస్తున్నట్లు జలమండలి వెల్లడించింది. కాగా గత సెప్టెంబరు 1 నుంచి ఇప్పటివరకు 6 లక్షల 50 వేలకు పైగా వివిధ సమస్యలపై ఫిర్యాదులు జలమండలి కస్టమర్ కేర్ కు అందగా, 12 లక్షలపైగా వాటర్ ట్యాంకర్ లను వినియోగదారులు బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఏఏ ప్రాంతాల్లో గత వేసవిలో అత్యధిక ట్యాంకర్ బుకింగ్స్ వచ్చిన విషయాన్ని కూడా ఏఐ ద్వారా గుర్తిస్తున్నారు. జలమండలి మొత్తం ఓఆర్ఆర్ పరిధిలోని కీలక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఏఐ వినియోగిస్తున్నట్లు జలమండలి శనివారం వెల్లడించింది. ఈ వివరాలతో అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన టాప్ 10 వినియోగదారులను ఏఐ సాయంతో గుర్తించారు. అందులో అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన ప్రాంతాలలో ప్రగతినగర్ లోని సౌతన్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ గత సంవత్సరంలో 674 ట్యాంకర్ లను బుక్ చేసినట్టు ఏఐ లెక్కలు తేల్చింది.

Also Read: Gold Rate Dropped: సామాన్యులకు ఎగిరి గంతేసే న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

ఎండీ పర్యటన

ప్రగతీనగర్ లో నీటి సరఫరా, అత్యధిక ట్యాంకర్ బుకింగ్ లు వచ్చిన ప్రాంతాల్లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి(Water Board MD Ashok Reddy) అధికారులతో కలిసి, సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రాంతాల్లో గతంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు 15 రోజుల కోసారి నీటి సరఫరా ఉండేదని, తరువాత జలమండలి చొరవతో పైపు లైన్లు మంజూరు చేయడంతో వారానికి ఒకసారి మంచి నీరు సరఫరా జరిగిందని స్థానికులు ఎండీకి చెప్పారు. అలాగే రెండు నెలల రెండు రోజులకు ఒక సారి తాగునీటి సరఫరా అవుతుందని వెల్లడించారు. రోజు విడిచి రోజు నీటి సరఫరా అందేలాగా స్థానికులు జలమండలి ఎండీకి విన్నవించుకున్నారు. అందుకే ఎండీ రోజు విడిచి రోజు నీటి సరఫరా చేపట్టాల్సిన పనులను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రగతినగర్ సంపునకు ప్రత్యేక ఫీడర్ మెయిన్ అభివృద్ధి చేస్తే ఈ సమస్య తీరిపోతుందని, దానికి రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు ఎండీకి వివరించారు.

ఇంకుడు గుంతలు లేకపోవడం

దానికి వెంటనే ప్రతిపాదనలను పరిశీలించిన ఎండీ వెంటనే పనులు చేపట్టాలని ఆమోద ముద్ర వేశారు. ఈ ప్రగతినగర్ ఎత్తైన ప్రాంతాల్లో ఉండటం, భూగర్భంలో ఎక్కువగా రాళ్లు ఉండటంతో, బోర్లు సఫలం కాగా, సఫలమైన వేసవిలో అడుగంటి పోవడంతో ఈ ప్రాంతవాసులు త్రాగు నీరుకోసం జలమండలిపై అధారపడుతున్నట్లు గుర్తించారు. వీటితో పాటు వందకు పైగా గృహ సముదాయాలకు ఇంకుడు గుంతలు లేకపోవడంతో జలమండలి ట్యాంకర్ల మీద వేసవిలో ఆధారపడుతున్నట్లు ఏఐ సాయంత విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఆరు వందలకు పైగా వాటర్ ట్యాంకర్ లను బుక్ చేసిన అపార్టుమెంటును అధికారులతో కలిసి సందర్శించారు.

అపార్ట్ మెంట్ ప్రాంగణంలో పాడైన బోర్ వెల్ ను గుర్తించిన ఎండీ వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అపార్ట్ మెంట్ వాసులకు సూచించారు. విశాలమైన అపార్టుమెంటు ఆవరణలో కొన్ని ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి బోరు పనిచేసే అవకాశం ఉంటుందని, తద్వారా వచ్చే వేసవిలో ట్యాంకర్ బుక్ చేసే అవసరం రాదని ఈ సందర్భంగా ఎండీ వివరించారు. దానికి అవసరమైన సాంకేతిక సహాయం జలమండలి స్థానిక అధికారులు అందజేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సీజీఎం ఆనంద్ నాయక్, జీఎం సుబ్బారాయుడు, డీజీఎం చంద్ర మోహన్, మే

Also Read: River In China: రివర్స్‌లో ప్రవహిస్తున్న నది.. వీక్షించేందుకు తరలివెళుతున్న జనం

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?