Paruchuri Gopala Krishna Conveys Wishes To Kalki Devara
Cinema

Tollywood: టాలీవుడ్‌ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు..!

Paruchuri Gopala Krishna Conveys Wishes To Kalki Devara: చిత్రసీమలో అటు డార్లింగ్‌ కల్కి 2898 ఏడీ మూవీ, ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీస్‌ కోసం వరల్డ్‌ వైడ్‌గా సినీ లవర్స్‌ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఆడియెన్స్‌ ముందుకు రానున్న ఈ మూవీకి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల ఇంట్రెస్టింగ్‌ విషయాలను మాట్లాడారు. ఇండస్ట్రీలో తనను పెదనాన్న అని పిలిచేది ఈ ఇద్దరు మాత్రమేనని గుర్తు చేశారు.

గతంలో కొందరు హీరోలు ఏడాదిలో ఆరు, ఏడు సినిమాలు చేసేవారు. కృష్ణ అయితే ఏకంగా ఓ ఏడాది 12 సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. భారీ బడ్జెట్‌ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందుకే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కల్కి సినిమా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానుంది. ఇందులో అగ్ర కథానాయకులు అమితాబ్‌, కమల్‌హాసన్‌ యాక్ట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌తో పాటు ఈ ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే ఆడియెన్స్‌ థియేటర్‌లోని కుర్చీలో కూర్చోగలరా అనిపిస్తుంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది కాబట్టి.. ఇది హిట్‌ అయితే నిర్మాతలతో పాటు ఎంతో మందికి మంచి జరుగుతుంది.

Also Read:పుష్ప కమ్‌ బ్యాక్‌, సాంగ్‌ తగ్గేదేలే..!

వర్షం టైమ్‌ నుంచి ప్రభాస్‌తో నాకు అనుబంధం ఉంది. ఆరడుగులు ఉన్నా.. ప్రభాస్‌ది పసిపిల్లాడి మనస్తత్వం. నాకు తెలిసి ఇప్పటివరకు అతడి నుంచి పరుష పదజాలాన్ని నేను వినలేదన్నారు. ఇక దేవర గురించి మాట్లాడుతూ..ఆది సినిమాలో కనిపించిన ఎన్టీఆర్‌ ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగాడో తలచుకుంటే ఆనందంగా ఉంటుంది. త్వరలోనే దేవరతో రానున్నాడు. ఇందులో తారక్‌ గెటప్‌ చూస్తే ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. ఇందులోనూ స్టార్స్‌ చాలామంది నటిస్తున్నారు. ఇది అద్భుతమైన విజయాన్ని సాధించాలి. కల్కి, దేవర రెండూ తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయంటూ ఇరువురి చిత్రబృందాలకు విషెస్‌ తెలిపారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?