Viral News: సిటీల్లో సొంత వాహనాలు లేనివారు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఉబర్, ఓలా వంటి సేవలపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఆయా సంస్థలు.. బైక్, ఆటో, క్యాబ్ సర్వీసులపై అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు తరుచూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి.. ఛేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా మరో వ్యక్తి పంచుకోవడంతో ఉబర్, ఓలా అధిక ఛార్జీల అంశం మరోమారు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిదంటే?
బెంగళూరులో గత కొన్ని రోజులుగా అడపాదడపా వర్షం కురుస్తోంది. దీంతో ఓ వ్యక్తి.. ఆటోలో తన గమ్యస్థానానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉబర్ ఆటోను బుక్ చేయగా అది కిలోమీటర్ దూరానికి రూ.425 చూపించింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి.. ఆటోలో వెళ్లడం కంటే ఒక గొడుగు కొనుక్కొని నడుచుకుంటూ వెళ్తేనే మంచిదని నిర్ణయించుకున్నాడని ఓ యూజర్ తెలియజేశాడు.
Also Read: Viral Video: రెజ్లింగ్ మ్యాచ్‌లో ఊహించని ఘటన.. వణుకుపుట్టిస్తున్న వీడియో!
నగర వాసుల రియాక్షన్
అయితే ఈ యూజర్ చేసిన సోషల్ మీడియా పోస్టుకు బెంగళూరు వాసులు స్పందిస్తున్నారు. తాము ఈ అధిక ఛార్జీల సమస్యను ఫేస్ చేసినట్లు చెప్పుకొచ్చారు. భారీ వర్షం, వరద, గుంతలతో నిండిన రోడ్లకు భయపడి ఆటో బుక్ చేసేందుకు యత్నించామని.. కానీ ఛార్జీలు చూసి షాక్ కు గురైనట్లు పేర్కొంటున్నారు. అంతేకాదు బెంగళూరు నగరంలో చినుకు పడితే పరిస్థితులు ఘోరంగా దిగజారిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Viral Video: రీల్స్ కోసం వెర్రి వేషాలు.. కళ్లముందే కొట్టుకుపోయిన యూట్యూబర్!
నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్
ఆటోలో కిలోమీటర్ కు రూ.425 ఛార్జీ వసూలు చేయడంపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఆటో కొనడానికి ఇదే సరైన సమయం’ అంటూ ఓ వ్యక్తి పోస్ట్ పెట్టాడు. ‘ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి సబ్ మెరైన్ కావాలి’ అని ఇంకొక యూజర్ అన్నారు. ‘జర్మనీలో మెర్సిడెస్ బెంజ్ టాక్సీ రైడ్స్ కూడా ఇలాగే ఉంటాయి’ అని మరొక యూజర్ పేర్కొన్నారు. ‘నేను గత వారం బెంగళూరులో ఉన్నాను. ఈ కష్టాన్ని అనుభవించాను. మీకు మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రావాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా భరించలేనిది’ అని ఇంకొకరు వాపోయారు.