Cocaine Seized: కొకైన్ తరలిస్తున్న ముగ్గురిని ఎక్సయిజ్ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 33.3 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ(Narayanaguda) వర్ధమాన్ బ్యాంక్ వద్ద తనిఖీలు జరుపుతుండగా ఇన్నోవా కారులో కొకైన్ తరలిస్తూ నాంపల్లి(Nampally)కి చెందిన మిస్బా ఖాన్, బంజారాహిల్స్ కు చెందిన అలీ అస్ఘర్, జుబేర్ అలీ పట్టుబడ్డారు. వీరిలో జుబేర్ అలీ అమెరికా పౌరుడు కావటం గమనార్హం. కొకైన్ ను బెంగుళూరు నుంచి తెప్పించినట్టు విచారణలో వెళ్లడయ్యింది. ఇదే కేసులో నిందితునిగా ఉన్న మొహమ్మద్ ఆజీమ్(Mohammad Azeem) పరారీలో ఉన్నాడు. ఇక, శంషాబాద్‌లో స్కూటీపై ఎండీఎంఏ(MDMA) డ్రగ్ తరలిస్తున్న మీర్జా సైఫ్ అలీ, అబ్దుల్, అబ్దుల్ హుస్సేన్ లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5.88 గ్రాముల డ్రగ్ ను సీజ్ చేశారు. ఖాజాగూడలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు సమాచారం అందటంతో దాడి చేసిన ఎక్సయిజ్ పోలీసులు నాగుల సాయి ప్రవీణ్, మనోచందర్, శ్రీవర్ధన్ లను అరెస్ట్ చేసి 2.07 ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: TVK Vijay: ఎన్నికల్లో పొత్తుపై టీవీకే అధినేత, హీరో విజయ్ కీలక ప్రకటన
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ(DCP) దారా కవిత(Kavitha) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్(Hyderabad) కు చెందిన 33 సంవత్సరాల వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాయంతో ఫోటోలను మార్ఫ్ చేసి ఓ వర్గానికి చెందిన వారి మత విశ్వాసాలను దెబ్బ తీసే రీతిలో రూపొందించిన పోస్టులను ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టాగ్రాం(Instagram) తదితర సోషల్ మీడియా(Social Medai) ప్లాట్ ఫాంలలోకి అప్ లోడ్ చేశాడు. వీటిని చూసిన ఓ వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం సీఐ ప్రసాదరావు(Cyber Crime CI Prasada Rao) కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy), క్రాంతికుమార్ రెడ్డి, శేఖర్, డీ.శేఖర్ లతో కలిసి నిందితున్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తప్పుడు ఐడీలు క్రియేట్ చేసి విద్వేషాలు రెచ్చగొట్టటానికే నిందితుడు ఇలాంటి పోస్టులు అప్ లోడ్ చేసినట్టుగా వెల్లడైంది.
Also Read: Unauthorised Cables: హైదరాబాద్‌లో 20 లక్షల విద్యుత్ స్తంభాలపై అనధికార కేబుళ్లు