Hydraa (imagecredit:swetcha)
హైదరాబాద్

Hydraa: అప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు?

Hydraa: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లలో కబ్జాలపాలైన చెరువులు, కుంటలు, నాలాలకు విముక్తి కలిగించేందుకు ఏర్పాటైన హైడ్రా((Hydraa))కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం కబ్జాల కు పాల్పడిన ఆక్రమణదారుల భరతం పట్టేందుకు రూల్స్ ప్రకారమే పనిచేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ బషీర్‌భాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైడ్రా ప‌నితీరును వివ‌రించారు. పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ హైడ్రా కులం(Cast), మ‌తం, ధ‌న‌వంతులు అనే తేడా లేకుండా హైడ్రా ప‌ని చేస్తోందన్నారు.

గండిపేట చెరువులో రాజ‌కీయ నాయ‌కుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించామని, హిమాయ‌త్‌సాగ‌ర్‌కు హ‌ద్దులు ఇంకా నిర్ధారించ‌ లేదన్నారు. న‌గ‌రంలోని చెరువుల‌న్నిటికీ ఏడాదిలో తుది నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని వివరించారు. ఫాతిమా కళాశాల విషయంలో సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలపై హైడ్రా క‌మిష‌న‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. చట్టం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. పాత‌బ‌స్తీలోని స‌ల్కం చెరువు ప‌రిధిలోకి వ‌స్తుంద‌న్న ఫాతిమా కాలేజీ, మేడ్చ‌ల్ జిల్లాలోని మ‌ల్లారెడ్డి కాలేజీ, ప‌ల్లా రాజేశ్వ‌ర రెడ్డి క‌ళాశాలైనా అన్నిట్లోనూ ఒకే విధానం హైడ్రాకు ఉందని ఆయన స్పష్టం చేశారు. హ‌ద్దులు నిర్ధారించాకే చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. ఫాతిమా కాలేజీ 2015లో నిర్మాణ‌మైందని, 2016లో స‌ల్కం చెరువుకు ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్ ఇచ్చారనీ. ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ఆధారంగా చ‌ర్య‌లుంటాయని ఆయన స్పష్టం చేశారు.

చూస్తున్న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త

న‌గ‌రంలో 80 శాతం చెరువులకు ఫైన‌ల్ నోటిఫికేష‌న్‌తో పాటు ప్రిలిమ‌న‌రీ కూడా లేదన్నారు. నగరంలో సుమారు 900 చెరువులు, నీటి వనరులు ఉన్నాయని. 65 శాతం చెరువులు కనుమరుగై పోయాయని. ఇందులో కేవలం 140 చెరువులకు మాత్రమే ఫైనల్‌ నోటిఫికేషన్‌ వచ్చిందని వివరించారు. మిగతావి వివిధ దశల్లోనే ఉన్నాయని, న్యాయస్థానాల్లో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే అన్ని అంశాలను సేకరిస్తున్నామన్నారు. న‌గ‌ర భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని హైడ్రా ప‌ని చేస్తోందని. ముందు త‌రాల‌కు హైడ్రా ఫ‌లాలు మ‌రింత అందుతాయని పేర్కొన్నారు. ఒక‌టి రెండేళ్లు ల‌క్ష్యంగా కాకుండా, వంద సంవ‌త్స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని హైడ్రా ప‌ని చేస్తోందని వివరించారు. మొద‌ట్లో హైడ్రాపై కొన్ని అపోహ‌లున్నా, ఫ‌లితాల‌ను చూస్తున్న న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త వ‌స్తోందని, మొదట్లో విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని కమిషనర్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో హైడ్రా పట్ల నెలకొన్న అపోహలు, విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. ఏడాది కాలంలో సాధించిన ప్ర‌గ‌తి, ఆటంకాల గురించి వివ‌రించారు. 

Also Read: TG Engineering Colleges: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపు.. ఈనిబంధనలు మస్ట్..?

ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ లక్ష్యంగా..

న‌గ‌ర ప్ర‌జ‌లు మెరుగైన జీవ‌నాన్ని సాగించ‌డానికి కృషి చేస్తున్నామనీ, ఈ క్ర‌మంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌ ఇస్తున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. కాలుష్యం వ‌ల్ల ప్ర‌జ‌లు రోగాల‌భారిన పడుతున్నారని, మ‌నం తీసుకునే ఆహారంలో ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలున్నాయ‌ని జాతీయ పోష‌కాహార సంస్థ సైంటిస్టులు చెబుతున్నారని ఆయన వివరించారు సున్నం చెరువు వ‌ద్ద బోరు బావి నీటిలో ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలున్న‌ట్టు గుర్తించామని, అందుకే చెరువుల్లో పూడికను తొల‌గించి, స్వ‌చ్ఛ‌మైన నీటి సాగ‌రాలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. మొదటి దశలో పాత‌బ‌స్తీలోని బ‌మృక్నుద్దౌలా చెరువు, మాధాపూర్‌(Madhapur)లోని సున్నం చెరువు, త‌మ్మిడికుంట అందుబాటులోకి వస్తాయని. రెండో విడ‌త‌గా మ‌రో 13 చెరువుల అభివృద్ధిని చేప‌డ‌తామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు.

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణతో పాటు ఆ చెరువుల‌ను అనుసంధానం చేసే వ‌ర‌ద కాలువ‌ల‌ను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇలా వ‌ర‌ద‌ల‌కు కూడా అడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు. కిర్లోస్క‌ర్‌, వోయింట్స్ నివేధిక‌ల్లో నాలాల వెడ‌ల్పు, పొడ‌వు గురించి స్ప‌ష్టంగా ఉందని. వీటికి తోడు ఎన్ ఆర్ ఎస్‌సీ, గ్రామ రికార్డులు, స‌ర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లు ఇలా అన్నిటినీ ప‌రిశీలించి శాస్త్రీయ‌మైన ప‌ద్ధ‌తిలో చెరువులు, నాలాల హ‌ద్దులు ఫిక్స్ చేస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత కబ్జాల పాలైన ఎన్నో చెరువులకు విముక్తి కలగడంతో పాటు ఆహ్లాద‌క‌రంగా మారినట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు.

అధికారాల‌తో పాటు స్వేచ్ఛ‌నిచ్చిన ప్ర‌భుత్వం

ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ, అధికారాలతో విపత్తుల నుంచి నగర ప్రజలకు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు హైడ్రా(Hydraa) ప‌ని చేస్తోంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ స్పష్టత ఇచ్చారు. అన్ని శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యంగా ప‌ని చేస్తున్నామ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి(Reavnth Reddy) ఇటీవ‌ల అమీర్‌పేట‌లోని ముంపు ప్రాంతాల‌ను పరిశీలించిన విషయాన్ని గుర్తు చేస్తూ. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించినట్లు వెల్లడించారు .ఇందుకు జీహెచ్ ఎంసీ, ఇరిగేష‌న్ ఇలా అన్ని శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యంగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: Coolie Collections: పాన్ ఇండియాలో దూసుకుపోతున్న ‘కూలీ’.. అక్కడ మాత్రం!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు