Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో యూరియా కొరత కారణంగా రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా నేడు ఈ పాస్ మిషన్ లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారుల లాగిన్ కాకపోవడంతో అధికారులు తర్జనభజన పడుతున్నారు. దీంతో రైతులు ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా కార్యాలయాల ముందు బారులు తీరారు.గత నెల రోజులకు పైగా రైతులు యూరియా కోసం పి.ఎ.సిఎస్, రైతు ఆగ్రో సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా ముందస్తు నిల్వలు లేకపోవడంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుకు కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు
ఇప్పటికే స్టాక్ పూర్తి
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)కు ఖరీఫ్ సీజన్ లో 3.67 లక్షల ఎకరాలలో సాగు చేసిన వివిధ రకాల పంటలకు జిల్లా వ్యవసాయ శాఖ 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని భావించి ఇండెంట్ మేరకు కేటాయింపులు చేశారు. జరిగి మే,జూన్ జూలై నెలలో పంపిణీ చేశారు. మే నెలలో 55 మెట్రిక్ టన్నులు జూన్ నెలలో 89 మెట్రిక్ టన్నులు, జులై నెలలో ఏకంగా 11,500 మెట్రిక్ టన్నులు ప్రాథమిక సహకార కేంద్రాలు, ఆగ్రో సెంటర్ల ద్వారా రైతులకు సరఫరా చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుత నెలలో మిగతా స్టాకు ఇప్పటికే పూర్తయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై నెలలో 11,500 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తే ఇంత ఇబ్బందులు మేము ఎదుర్కోమని రైతులు వాపోతున్నారు. పక్కనున్న కర్ణాటక సరిహద్దు మండలాలైన కేటీ దొడ్డి, గట్టు, ఐజ మండలాలలో అక్కడి రైతులు ఇక్కడి యూరియాని వాడినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాకు 600 బస్తాలు కేటాయింపు
యూరియా(Urea) కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు(Farmers) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ, డీఎస్పీ, వ్యవసాయ అధికారులు రైతుల(Farmers)కు నచ్చజెప్పి త్వరలో జిల్లాకు యూరియా వస్తుందని నచ్చ చెప్పారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ను కలిసి జిల్లాకు తగినంత యూరియా కేటాయింపులు చేయాలని విన్నవించారు. ఈ మేరకు జిల్లాకు 600 బస్తాలు కేటాయించారు. ఈపాస్ మిషన్ లో రైతుల ఆధార్ నెంబర్ నమోదుకు మిషన్ లాగిన్ కాకపోవడంతో పిఎసిఎస్ చైర్మన్ సుభాన్ చొరవతో రైతులకు రషీద్ ఆధారంగా యూరియాను పంపిణీ చేస్తున్నారు.దీంతో రైతులకు పంటల సాగును బట్టి ఎకరాల ఆధారంగా ఒక బస్తా నుంచి రెండు బస్తాల వరకు ఇస్తున్నారు.
Also Read: Urea Shortage: రాష్ట్రంలో యూరియా కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు