GHMC Transport Wing (imagecredit:swetcha)
హైదరాబాద్

GHMC Transport Wing: నియామకం నుంచి ఒకే చోట విధి నిర్వహణ.. రవాణాలో ఫోర్ మాన్‌లదే హవా!

GHMC Transport Wing: అక్రమాలు, అవకతవకలు, నిత్యం కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన జీహెచ్ఎంసీ(GHMC) ట్రాన్స్ పోర్టు విభాగంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. సమర్థులైన ఐఏఎస్(IAS) ఆఫీసర్లు జీహెచ్ఎంసీకి బాస్ లుకా వస్తున్నా, ట్రాన్స్ పోర్టు వింగ్ ను గాడీన పెట్టలేపోతున్నారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కమిషనర్ మొదలుకుని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వరకు వివిధ హొదాల్లోని ఆఫీసర్ల వినియోగించుకే వాహానాలు, పాలక మండలి పెద్దల వాహానాలు, ఎస్కార్ట్ వాహానాలతో పాటు సుమారు వంద వరకు చెత్త తరలింపు వాహానాలతో పాటు ఆఫీసర్లు వెహికల్స్, డ్రైవర్ కమ్ ఓనర్స్ వెహికల్స్ తో పాటు అద్దె వాహానాలు వ్యవహారాలను చూసుకునేట ట్రాన్స్ పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బోగస్ ఇండెంట్ల తో పాటు స్పేర్ పార్ట్స్, నాలాల్లోని పూడికతీత తరలింపునకు సంబంధించి వరుసగా స్కామ్ లు జరిగిన రవాణా విభాగంలో నేటికీ పరిస్థితి సిబ్బంది ఇష్టారాజ్యంగానే కొనసాగుతుంది. ఈ విభాగంలో పని చేసే నైపుణ్యత లేకపోయినా, ఆఫీసర్లను, పాలక మండలి పెద్దలను మేనేజ్ చేసుకునే స్కిల్ ఉంటే అక్రమార్జనకు కొదవే లేదన్న వాదనలున్నాయి. ప్రస్తుతం రవాణ శాఖలో ఫోర్ మెన్లదే హవా కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతుంది.

ఇప్పటి వరకు బదిలీలే లేకపోవటం

అతి పెద్ద ట్రాన్స్ పోర్టు యార్డు అయిన కవాడిగూడలో కొందరు ఫోర్ మెన్లు నియామకం మొదలు నేటిక సుమారు మూడు దశాబ్దాలు గడుస్తున్నా, అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎం(GHMC)సీ లోని ఇతర విభాగాల్లో బదిలీలు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్ పో్ర్టు విభాగంలో ఇప్పటి వరకు బదిలీలే లేకపోవటం గమనార్హం. ఫలితంగా ఏళ్లుగా ఇక్కడ తిష్ట వేసిన ఫోర్ మెన్లు తమ ఇష్టారాజ్యంగా ఇంటెంట్లు రాసుకుని, క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కావాడిగూడలోని ఓ ఫోర్ మెన్ సుమారు 20 ఏళ్ల నుంచి అక్కడే కొనసాగుతూ, గతంలో స్పేర్ పార్ట్స్ స్కీమ్ వెలుగులోకి వచ్చినపుడు తన కింది స్థాయి ఉద్యోగిని బలి చేసి, తాము తప్పించుకుని, కొద్ది రోజుల క్రితమే పాలక మండలిలో కీలకమైన వ్యక్తిని మేనేజ్ చేసుకుని మళ్లీ కావాడిగూడ ఫోర్ మెన్ పోస్టింగ్ ను దక్కించుకుని హవా చెలాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాలకమండలిలో ఓ కీలక వ్యక్తిని మేనేజ్ చేసుకుని, లక్షలాది రూపాయలు అమ్యామ్యాలుగా సమర్పించుకుని కావాడిగూడలో ఫోర్ మెన్ సీటు దక్కించుకోవటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: World of Thama: థామ’ టీజర్ రిలీజ్.. అలాంటి పాత్రలో రష్మిక?

నియామకం నుంచే అక్కడే

ట్రాన్స్ పోర్టు విభాగం హెడ్ ఆఫీసులో మే 16, 1992 లో ఫోర్ మెన్ గా విధుల్లో చేరిన ఓ ఉద్యోగి వచ్చే 2033 ఫిబ్రవరి 28 తేదీన రిటైర్డు కావల్సి ఉంది. కానీ ఆయన విధుల్లో చేరిన మే 16, 1992 నుంచి ఎలాంటి బదిలీలు గానీ, పదోన్నతులు గానీ లేకుండా ఒకే సీటులో కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అదే శానిటేషన్ విభాగంలో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న శానిటరీ జవాన్లను గత సంవత్సరం చివర వరకు కమినర్ గా వ్యవహారించిన ప్రస్తుత మున్సిపల్ శాఖ కమిషనర్ కే.ఇలంబరితి బదిలీలు చేసి, సంచలనం సృష్టించినా, ఆయన ట్రాన్స్ పోర్టు విభాగంలోని లాంగ్ స్టాండింగ్ లపై దృష్టి సారించలేకపోయారు. ఆయన దృష్టి సారించే సమయానికి బదిలీ అయినట్లు టాక్ లేకపోలేదు. ప్రస్తుతం ప్రతి మూడు నుంచి అయిదేళ్లలో అన్ని విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి బదిలీ అవుతుంటే, ఆ బదిలీలు ట్రాన్స్ పోర్టు విభాగానికి ఎందుకు వర్తించదని ఇతర విభాగాల ఉద్యోగులు, ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు.

ట్రావెల్స్ వెహికల్స్ గా వైట్ ప్లేటు వాహానాలు

జీహెచ్ఎంసీలో వాహానాన్ని అద్దెకు నడపాలంటే మోటారు వెహికల్ యాక్టు ప్రకారం ఆ వాహానం ఎల్లో ప్లేటు కలిగి ఉండాలి. కానీ జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఆ పై హొదాలో విధులు నిర్వహిస్తున్న కొందరు ఆఫీసర్లు తమ సొంత వాహానాలను వినియోగిస్తూ, నెలాదాటగానే బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మరి కొందరు అధికారులకు తమకున్న టూ వీలర్ వాహానాలపై రాకపోకలు సాగిస్తూ తాము కారు వినియోగిస్తున్నట్లు టూ వీలర్ నెంబర్ ప్లేటుతో ట్రాన్స్ పోర్టు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తత కమిషనర్ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించి, ట్రాన్స్ పోర్టు విభాగంలో కొనసాగుతున్న లాంగ్ స్టాండింగ్ లు, అక్రమాలు, అవకతవకలకు బ్రేక్ వేయాలని జీహెచ్ఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు.

Also Read; Farmers Protest: గద్వాల జిల్లాలో యూరియా నిల్.. విసుగెత్తి రోడ్డెక్కిన రైతులు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?