GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా దోమల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగం నిర్వీర్యం దిశకు చేరుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మహానగరంలో రోజుల తరబడి నీరు నిల్వ ఉండే ప్రాంతంలో, నాలాలు, మూసీ పరివాహాక ప్రాంతాలతో పాటు చెరువుల్లో దోమల వృద్ధి చెందకుండా గుడ్డ దశలోనే ధ్వంసం చేసేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించటంతో పాటు డీజిల్, మాలాథిన్ కెమికల్స్ మిశ్రమాన్ని ఫాగింగ్ చేయాల్సి ఉంది.
గ్రేటర్ లోని 30 సర్కిళ్లు, 150 డివిజన్లలో దోమల నివారణ కోసం 3 సర్కిళ్లలో 60 చిన్న ఫాగింగ్ మిషన్లను, 150 డివిజన్లలో డివిజన్ కు రెండు చొప్పున పెద్ద ఫాగింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. ఆరు జోన్ల పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ జరగటం లేదని ఫిర్యాదులొస్తున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణిలో మల్కాజ్ గిరికి చెందిన స్థానికులు తమ ప్రాంతంలో ఫాగింగ్ జరగటం లేదని, ఫాగింగ్ కోసం ఇస్తున్న డీజిల్, మాలాథిన్ కెమికల్స్ వినియోగం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఆరో జోన్లలో దోమల నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఎంటమాలజిస్టు లు బి
అమలు కాని కమిషనర్ షెడ్యూల్
జీహెచ్ఎంసీ(GHMC) ఎంటమాలజీ విభాగంలో మొత్తం మ్యాన్ పవర్, డివిజన్ కు రెండు చొప్పున 300 చిన్న ఫాగింగ్ మిషన్లు, మరో సర్కిల్ కు రెండు చొప్పున మొత్తం 60 పెద్ద ఫాగింగ్ మిషన్లతో పాటు 2500 మంది మ్యాన్ పవర్, ఇందులో 200 మంది కరోనా టీమ్ వర్కర్లతో కలిపి సిటీలో దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ చేసేందుకు కమిషనర్ ప్రత్యేక టైమ్ టెబుల్ ఇచ్చారు. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఏ మాత్రం అమలు కావటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇందుకు సర్కిళ్ల వారీగా దోమల బెడదపై వస్తున్న ఫిర్యాదులే నిదర్శనమన్న వాదనలున్నాయి.
అందుబాటులో ఉన్న మ్యాన్ పవర్, మిషనరీతో ప్రతి రోజు రెండు సార్లు ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇచ్చిన షెడ్యూల్ కూడా ఎక్కడా అమలు కావటం లేదని తెల్సింది. ఫలితంగా వాటర్ లాగింగ్ పాయింట్లు, చెత్త కుప్పలు, నాలా పరివాహాక ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నట్లు జీహెచ్ఎంసీకి వరుసగా ఫిర్యాదులందుతున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టకముందు హెల్త్ వింగ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన కర్ణన్ వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచే దోమల నివారణ, అంటు వ్యాధుల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ దోమల నివారణ కోసం ఫాగింగ్.
Also Read: War 2 Climax: ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు వార్ 2 క్లైమాక్స్ మార్చారా?
పాడైన ఫాగింగ్ మిషన్లు, రిపేర్లపై బోగస్ బిల్లులు
జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలోని 30 సర్కిళ్లలో చాలా ప్రాంతాల్లో దోమల నివారణ కోసం ఫాగింగ్ గానీ, యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్ర్రియ గానీ జరగటం లేదని తెల్సింది. ఇదే విషయంపై ఆరా తీయగా, ఆరు జోన్లలోని చాలా ప్రాంతాల్లో చిన్న, పెద్ద ఫాగింగ్ మిషన్లు మరమ్మతుల పాలైనట్లు, వాటికి మరమ్మతులు చేయకుండానే సీనియర్ ఎంటమాలజీస్టులు మరమ్మతులు చేసినట్లు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నప్పటికీ ఫీల్డు లెవెల్ లో మాత్రం మిషన్లను వినియోగించకపోవటంతో ఫాగింగ్ మూలనపడినట్లు తెలిసింది.
ఇలాంటి వ్యవహారాలు ఖైరతాబాద్ జోన్ లో అత్యధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ సీనియర్ ఎంటమాలజిస్టుగా పని చేస్తున్న ఓ అధికారి గతంలో ఎల్బీనగర్ జోన్ లో సీనియర్ ఎంటమాలజిస్టుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, ఎంటమాలజీ ఫీల్డు వర్కర్లకు చెల్లించాల్సిన జీతాల్లో నెలసరి కోతలు విధిస్తూ, అక్రమ వసూల్లకు పాల్పడి, రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోవటంతో అప్పట్లో ఉన్నతాధికారులు సదరు అధికారిని మాతృ శాఖకు సరెండర్ చేయగా, కేవలం రెండు ఏళ్లలోనే ఈ అధికారి మళ్లీ పైరవీలు చేసుకుని, మళ్లీ ఖైరతాబాద్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్టుగా పాగా వేసినట్లు ఆరోపణలున్నాయి.
Also Read: Congress MLA Resign: కేరళ కాంగ్రెస్‌లో నటి కలకలం.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి రాజీనామా