GHMC Property tax ( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC Property tax: దారి మళ్లుతున్న బల్దియా నిధులు.. ప్రాపర్టీ టాక్స్ వసూళ్ల చేతివాటం!

GHMC Property tax: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ(GHMC)కి న్యాయంగా రావాల్సిన నిధులన్నీ దారి మళ్లుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎం(GHMC)సీకి ఉన్న ప్రధాన ఆర్థిక వనరులతో సంక్షోభం నుంచి కార్పొరేషన్ ను గట్టెక్కించేందుకు ఉన్నతాధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అంతకన్నా రెట్టింపు ప్రయత్నాలు జీహెచ్ఎంసీ(GHMC) ఖజానాను దోచుకునేందుకు జరుగుతున్నట్లు సమాచారం. అన్నం పెడుతున్న బల్దియా ఖజానాకే కన్నం వేసేందుకు కొందరు సిద్దమైనట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ మొదలుకుని, ఏటా వసూలు చేయాల్సిన ట్యాక్స్ కలెక్షన్ కు సంబంధించి కూడా సిబ్బంది అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ(GHMC)ని ఆర్థికంగా కొంత మేరకైనా గట్టెక్కించేందుకు అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కు సంబంధించి టార్గెట్లు విధించటం కార్పొరేషన్ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని 30 సర్కిళ్లలోని సుమారు 19.50 లక్షల ఆస్తుల నుంచి ప్రతి ఏటా సుమారు రూ.2 వేల కోట్ల పై చిలుకు ట్యాక్స్ కలెక్షన్ చేసుకునేవారు. మొత్తం ట్యాక్స్ చెల్లిస్తున్న మొత్తం 19.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లకు చెందిన సుమారు 300 డాకెట్లున్నాయి. వీటిలో ఎక్కువ ఆస్తులు గోషామహాల్ సర్కిల్ లోనే ఉన్నట్లు సమాచారం. ట్యాక్స్ కలెక్షన్ చేసేందుకు జీహెచ్ఎంసీలో 300 మంది బిల్ కలెక్టర్లు, మరో 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లున్నారు. వీరిలో సగానికి పైగా ట్యాక్స్ సిబ్బంది కంచే చేను మేసిందన్న చందంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Also Read: Rajiv Gandhi Civils Abhaya Hastham: యువతకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరు రూ.లక్ష పొందే.. అద్భుతమైన స్కీమ్!

దోపిడీ ఇలా..
సరూర్ నగర్(Saroor Nagar) సర్కిల్ లోని కొత్త పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ కు విధించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ లో సింహాభాగం ట్యాక్స్ సిబ్బంది జేబుల్లోకి వెళ్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సిటీలోని కమర్షియల్, రెసిడెన్షియల్ ఆస్తులకు బెంచ్ మార్క్ 56 కాలమ్ ప్రకారం పన్ను విధించాల్సిన ట్యాక్స్ సిబ్బంది రికార్డుల్లోకి తక్కువ యూసేజీ ఏరియాను ఎక్కిస్తూ, కమర్షియల్ వినియోగాన్ని కాస్త రెసిడెన్షియల్ వినియోగంగా పొందుపరుస్తూ ఏటా జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులను జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొత్త పేటలోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో సుమారు 450 పై చిలుకు వ్యాపార సంస్థలున్నాయి. వీటి నుంచి జీహెచ్ఎంసీకి ఏటా రూ. 13 కోట్ల ట్యాక్స్ రావల్సి ఉండగా, ప్రస్తుతం ఏటా రూ. 2 కోట్ల 91 లక్షల వరకు మాత్రమే చెల్లిస్తున్న విషయాన్ని ఇటీవలే అధికారులు బయటకు తీశారు. మిగిలిన మరో రూ. పది కోట్లు యజమానికి ఆదా అయ్యేలా అసెస్ మెంట్ సమయంలోనే స్థానిక ట్యాక్స్ సిబ్బంది యజమానులతో నెలకు లక్షల రూపాయాల్లో లంచాలు తీసుకుని, వారికి పన్ను తగ్గించి, వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

సెక్షన్ 213 సాకుగా చూపుతూ..
1959 మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 213 ను సాకుగా చూపుతూ ట్యాక్స్ సిబ్బంది ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతమున్న ట్యాక్స్ కలెక్షన్ విధానంలో ఆస్తులను అసెస్ మెంట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటం, వార్షిక పన్ను విధించి ఏటా కలెక్షన్ చేసే సిస్టమ్ అమల్లో ఉంది. ఈ పాత విధానం ప్రకారం ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన భవన యజమాని ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారా? లేదా? అని ప్రశ్నించటం వరకే ట్యాక్స్ స్టాఫ్ కు అధికారముండేది. కానీ 213 సెక్షన్ ను అమల్లోకి వచ్చిన తర్వాత సెక్షన్ ను అడ్డం పెట్టుకుని చేస్తే ట్యాక్స్ సిబ్బంది ఆయా ఆస్తుల యజమానుల వద్దకు నేరుగా వెళ్లి, భవన నిర్మాణ అనుమతి ప్రతి, నిర్మాణంలో డీవీయేషన్స్, అక్యుపెన్సీ సర్టిఫికెట్ తో పాటు యూసేజీకి సంబంధించిన అన్ని పత్రాలను తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక వేళ రెసిడెన్షియల్ నిర్మించి కమర్షియల్ గా వినియోగిస్తున్నట్లయితే, అలాంటి ప్రాపర్టీలకు నూరు శాతం ట్యాక్స్ ను పెంచే అధికారం స్టాఫ్ కు వస్తుంది.

ఈ సెక్షన్ 213 అమలుతో మహానగరంలోని ప్రతి భవనాన్ని సంబంధిత పత్రాలతో తనిఖీ చేసే పవర్ స్టాఫ్ కు సమకూరటంతో ప్రతి సర్కిల్ లో డిప్యూటీ కమిషనర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్లు ఓ గ్రూపుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. షాపింగ్ మాల్స్ లలో పదుల సంఖ్యలో వ్యాపార సముదాయాలున్నా, భవన యజమానులు, వ్యాపారులతో ట్యాక్స్ సిబ్బంది బేరం కుదుర్చుకుని వాటికి రెసిడెన్షియల్ ట్యాక్స్ ను, అది కూడా నామమాత్రంగా వసూలు చేస్తూ జీహెచ్ఎంసీ(GHMC)కి రావాల్సిన ట్యాక్స్ నిధులను జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే తరహా దోపిడీ ఇటీవలే ఖైరతాబాద్ జోన్(Khairatabad Zone) లో వెలుగుచూసినట్లు, అందుకు బాధ్యులైన డిప్యూటీ కమిషనర్ పై చర్యలు తీసుకునేందుకు రంగం కూడా సిద్దమైనట్లు సమాచారం.

ట్రేడ్ లైసెన్స్ ల్లోనూ అక్రమాలు
సిటీలోని ప్రతి వ్యాపార సంస్థకు జీహెచ్ఎంసీ(GHMC) జారీ చేస్తున్న ట్రేడ్ లైసెన్స్ ల జారీ, రెన్యూవల్ లోనూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మెయిన్ రోడ్డు, సబ్ రోడ్డు, కాలనీ రోడ్డు, పాష్, సెమీ పాష్ ఏరియాల్లోని వ్యాపార సంస్థలకు రకరకాలుగా ఫీజులు వర్తింపజేస్తూ ట్రేడ్ లైసెన్స్ లను జారీ చేయాల్సి ఉంది. కనిష్టంగా ఒక్కో వ్యాపార సంస్థకు ప్రతి అడుగుకు కనిష్టంగా రూ.6 .30 పైసలను వర్తింపజేస్తూ ట్రేడ్ లైసెన్స్ లను జారీ చేయాల్సి ఉంది. దీన్ని ప్రతి ఏటా ఫీల్డు ఇన్ స్పెక్షన్ చేసి రెన్యూవల్ చేయాల్సి ఉంది. ఇక గరిష్టంగా బడా వ్యపారాలకు ఒక్కో అడుగుకు రూ.40, ఏటీఎంలకు ఒక్కో అడుగుకు రూ. 60 లను వర్తింపజేస్తూ ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలను వసూలు చేయాల్సి ఉంది.

కానీ చాలా ట్రేడ్ లైసెన్స్ లకు సంబంధించి ఉన్న యూసేజీ ఏరియాను సగానికి తగ్గించి, కనిష్ట ఛార్జీలైన ఆరు రూపాయల 30 పైసలను వర్తింపజేసి జారీ చేస్తున్నట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు. చాలా ఏటిఎంకు కూడా ఒక్కో అడుగుకు రూ.60 వర్తింపజేయాల్సి ఉండగా, కేవలం రూ.40 వర్తింపజేసి లైసెన్స్ లు జారీ చేసి, వ్యాపారులతో బేరం కుదుర్చుకుని సిబ్బంది జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సిటీలోని బంజారాహిల్స్ వంటి ఖరీదైన ఏరియాలో ఓ స్టార్ హోటల్ వ్యాపారం మొదలుపెట్టి, దశాబ్దాలు గడుస్తున్నా, ఆ హోటల్ కు మూడేళ్ల క్రితం నుంచే అతి తక్కువ ఫీజుకు ట్రేడ్ లైసెన్స్ జారీ చేసినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యడైన ఓ మెడికల్ ఆఫీసర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు, ఈ హోటల్ ట్రేడ్ లైసెన్స్ జారీ విషయంలో సదరు అధికారిని కూడా బాధ్యులను చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

 Also Read:Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో భార్యభర్తల పంచాయితీ.. జడ్జెస్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు! 

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు