Hero Prabhas Chakram Re Release On 8th June
Cinema

Re-Release: రీ రిలీజ్‌ మూవీస్‌కి కరువవుతున్న ఫ్యాన్స్‌

Hero Prabhas Chakram Re Release On 8th June: టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆ ఊపు కాస్త తగ్గింది. అయితే అన్ని సినిమాలను రీ రిలీజ్ చేసినంత మాత్రాన థియేటర్లు నిండటం లేదు. జనాలకు నచ్చిన, మెచ్చిన చిత్రాలను రిలీజ్‌ చేస్తేనే థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఏదో ప్రెస్టేజ్ కోసం, ఏ సినిమాలు రావడం లేదు కదా? అని ఏదో ఒక సినిమాను రీ రిలీజ్ చేస్తే మాత్రం జనాలు చూసేందుకు రెడీగా లేరు. ఎన్టీఆర్, బాలయ్య, చిరు మూవీస్‌ని రీ రిలీజ్ చేస్తేనే అంతగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

మహేష్ బాబు ఒక్కడు, పోకిరి.. పవన్ కళ్యాణ్ ఖుషి, జల్సా, తొలిప్రేమ, తమ్ముడు.. రామ్ చరణ్ ఆరెంజ్..ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలే రీ రిలీజ్‌ విషయంలో సక్సెస్ అయ్యాయి. చెన్నకేశవరెడ్డి, సింహాద్రి, గ్యాంగ్ లీడర్ వంటి మూవీస్‌ను రీ రిలీజ్ చేస్తే జనాలు అంతగా ఆదరించలేదు. అలాంటి ప్రభాస్ చక్రం మూవీని రీ రిలీజ్ చేస్తే జనాలు వస్తారని, థియేటర్లు నిండుతాయని ఎవరు ఆలోచన చేశారో, ఆచరణలోకి పెట్టారో అని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో కొందరు ఈ రీ రిలీజ్‌లను క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు.

Also Read: అయినా తగ్గని ‘వాయువేగం’

కానీ అవి చాలా కొద్దిమంది హీరోలకు, కొన్ని మూవీస్‌కి మాత్రమే వర్కౌట్ అవుతున్నాయి. నితిన్ ఇష్క్, జర్నీ రీ రిలీజ్‌లు అయ్యాయని కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయాయి. ఇప్పుడు ఈ చక్రం మూవీతో పాటు ప్రేమకథాచిత్రం కూడా రీ రిలీజ్ కాబోతోంది. జూన్ 7న అసలే చాలా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే మధ్యలో ఈ రీ రిలీజ్‌లు ఒకటి అన్నట్టుగా జనాలు అనుకునేలా చేస్తున్నారు. మరి ఈ చక్రం మూవీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాని చూపించనుందా లేక డిజాస్టర్‌ అయ్యేందుకు రెడీగా ఉందా అని ఆడియెన్స్‌ అంచనా. చూడాలి మరి జనాలు ఈ మూవీని ఏ విధంగా ఆదరిస్తారో…

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?