Indian Railways (Image Source: Twitter)
జాతీయం

Indian Railways: రైళ్లల్లో బాగా వేధిస్తున్న సమస్య ఎంటో తెలుసా? లక్షకు పైగా ఫిర్యాదులు దానిపైనే!

Indian Railways: రోజూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో నిత్యం ఏదోక సమస్య ప్రయాణికులకు ఎదురవుతూనే ఉంటుంది. అయితే కొందరికి సీటు దొరక్కపోవడం సమస్యగా మారితే.. మరికొందరికి రైలు ఆలస్యం కావడం, భద్రతా లోపాలు ఇబ్బందిగా మారవచ్చు. అయితే ప్రధానంగా రైలు ఎక్కిన వారిని ఒక సమస్య తీవ్రంగా ఇబ్బందికి గురిచేసినట్లు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) తాజాగా విడుదల చేసిన నివేదికను బట్టి తెలుస్తోంది. పార్లమెంటుకు సమర్పించిన ఆ రిపోర్టులో పలు కీలక విషయాలను కాగ్ వెల్లడించింది.

వివరాల్లోకి వెళ్తే..
భారతీయ రైల్వేలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన నివేదికను బుధవారం కాగ్ (CAG) పార్లమెంటుకు సమర్పించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరుగుదొడ్లు, వాష్ బేసిన్లలో నీరు అందుబాటులో లేదని తెలియజేస్తూ మొత్తం 1,00,280 ఫిర్యాదులు అందాయని అందులో పేర్కొంది. వాటన్నింటిని భారతీయ రైల్వే పరిష్కరించిందని తెలిపింది. అయితే 33,937 (33.84%) ఫిర్యాదుల్లో సమస్య పరిష్కారానికి నిర్ధేశిత గడువు కంటే ఎక్కువ సమయం పట్టిందని కాగ్ తన రిపోర్ట్ లో తెలియజేసింది. ఈ నివేదికలో 2018-19 నుంచి 2022-23 వరకు దూరప్రయాణ రైళ్లలో శుభ్రత, పారిశుద్ధ్యంపై రైల్వే పనితీరును పార్లమెంటుకు తెలియజేసింది.

బయో-టాయిలెట్ల పరిశీలన
దూరప్రయాణ రైళ్లలో బయో-టాయిలెట్ల శుభ్రతపై సర్వే నిర్వహించినట్లు కాగ్ తాజా రిపోర్ట్ లో తెలిపింది. దీని ప్రకారం 96 రైళ్లలో 2,426 మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించారు. ఇందులో ఐదు జోన్‌లలో 50% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేయగా రెండు జోన్‌లలో 10% లోపు మాత్రమే సంతృప్తి వ్యక్తమైంది.

నీటి కొరతపై చర్యలు
మరోవైపు రైళ్లలో నీటి కొరతపై తరచూ ఫిర్యాదులు రావడంతో రైల్వే బోర్డు 2017లోనే క్విక్ వాటరింగ్ అరేంజ్‌మెంట్ (QWA) ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కాగ్ నివేదిక తెలిపింది. అయితే గుర్తించిన 109 స్టేషన్లలో 81 (74%) స్టేషన్లలో మాత్రమే ఈ సదుపాయం 2023 మార్చి నాటికి అమలులోకి వచ్చిందని తెలిపింది. మిగతా 28 స్టేషన్లలో నిధుల కొరత, కాంట్రాక్టర్ పనితీరు మందగింపు, పనులు నిలిపివేయడం వంటి కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోందని పార్లమెంటుకు తెలియజేసింది.

బడ్జెట్, ఖర్చుల వివరాలు
బడ్జెట్ లో రైల్వేకు కేటాయించిన నిధులను ఏ విధంగా ఖర్చు చేశారో కూడా కాగ్ తన నివేదికలో తెలియజేసింది. శుభ్రతకు కేటాయించిన ఫైనల్ బడ్జెట్ గ్రాంట్ (FBG) కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేసినట్లు చెప్పింది. దక్షిణ మధ్య రైల్వేలో 100% అధిక ఖర్చు, నార్త్ సెంట్రల్ రైల్వేలో 141%, ఈస్ట్ సెంట్రల్ రైల్వే (63%), సౌత్ వెస్ట్రన్ రైల్వే (94%) బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలిపింది. లినెన్ మేనేజ్‌మెంట్ ఖర్చులు అన్ని జోన్‌లలో FBG కంటే ఎక్కువే కాగా (102%–145%), 11 జోన్‌లలో కరోనా కారణంగా తక్కువ వినియోగం నమోదైందని తెలిపింది. కోచ్ శానిటేషన్ ఖర్చులు 102% – 147%  మధ్య ఉన్నాయని కాగ్ రిపోర్ట్ తెలిపింది.

క్లీన్ ట్రైన్ స్టేషన్స్ (CTS) పథకం
రైల్వేశాఖ ప్రవేశపెట్టిన క్లీన్ ట్రైన్ స్టేషన్స్ (CTS) పథకం ఆశించిన స్థాయిలో మెరుగైన పనితీరు కనబరచలేదని కాగ్ రిపోర్ట్ అభిప్రాయపడింది. రైళ్లు ఆగినప్పుడు కోచ్‌లలో బయో-టాయిలెట్లు, డోర్‌వేలు వంటివి యంత్రాల ద్వారా శుభ్రం చేయాలని ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, కాంట్రాక్టు నిబంధనలు సరిగా అమలు చేయకపోవడం, సిబ్బంది తక్కువగా ఉండటం వలన లక్ష్యాలు సాధించలేకపోయినట్లు నివేదిక తెలిపింది. తొలి దశలో 12 జోన్‌లలో 29 స్టేషన్లలో CTS పథకాన్ని పరిశీలించగా.. మరుగుదొడ్ల పరిమిత శుభ్రత, యంత్రాల వినియోగ లోపం, తగిన మానవ వనరుల లేమి కనిపించిందని నివేదిక తెలిపింది.

Also Read: Hydraa: హైడ్రా దూకుడు.. జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు.. రూ.400 కోట్ల ఆస్తులు సేఫ్!

ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ సర్వీసులు (OBHS)
భారతీయ రైల్వేలు అందించే ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ సర్వీసుల (OBHS)పై ప్రయాణికుల సంతృప్తి 54% – 84% మధ్య ఉందని కాగ్ రిపోర్ట్ తెలిపింది. నార్తర్న్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వేలో మాత్రం 95% పైగా సంతృప్తి నమోదైనట్లు చెప్పింది. వెస్ట్రన్ రైల్వేలోని కాంకారియా డిపో ఆర్థికంగా, పర్యావరణహితంగా సమర్థవంతంగా పనిచేస్తోందని నివేదిక ప్రశంసించింది. మొత్తంగా రైల్వే శుభ్రత, పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకున్నప్పటికీ అమల్లో లోపాలు, ఆలస్యం, నిధుల వినియోగ సమస్యలు ఉన్నట్టు ఈ ఆడిట్ నివేదికలో స్పష్టమైంది.

Also Read This: Miyapur Atrocity: హైదరాబాద్‌లో మిస్టరీ డెత్స్.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?