Ponguleti Srinivas Reddy( IMAGE CREDIT: TWITTER)
హైదరాబాద్

Ponguleti Srinivas Reddy: వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. 2 లక్షలకు పైగా?.. మంత్రి కీలక వాఖ్యలు

Ponguleti Srinivas Reddy: పేదలకు అందించేందుకు నిర్మిస్తున్న 2 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. గత ప్రభుత్వంలా తాము మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్‌(Hyderabad)లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను, ఆధునీకరించిన కార్యాలయ ఛాంబర్లను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Also Read: Ponguleti Srinivas Reddy: తెలంగాణ సమాజానికి మహిళలే పునాది.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారు. 

పేదల ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలవుతోందన్నారు. గ్రామాల్లో అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు వస్తాయన్న భరోసా కల్పించగలిగామని, ఇది చేతల ప్రభుత్వమని, ఇప్పటికే గ్రామాల్లో కొనసాగుతున్న పనులే నిదర్శనమని అన్నారు. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి  లబ్ధిదారులకు చెల్లింపులు జరిగేలా చూస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్ ప్రసంగిస్తూ కార్పొరేషన్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే చర్యల్లో భాగంగా, జిల్లాల్లో ఏఈల నియామకంతో పాటు, అవసరమైన మేరకు ఇతర విభాగాల అధికారుల సేవలు వినియోగించుకుంటున్నారని పొంగులేటి తెలిపారు.

 Also Read: Minister Ponguleti Srinivasa Reddy: జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా.. ఇందిరమ్మ ఇండ్లు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!