Minister Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆయసమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్ణణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, ముఖ్యంగా హైదరాబాద్‌కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.
జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు
హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మించగా సుమారు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారన్నారు. ఇటీవల క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరుపగా కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడతలో హైదరాబాద్‌లో 16 మురికివాడలను గుర్తించామని. అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
Also Read: TPCC Mahesh Kumar Goud: కేసీఆర్‌తో ఈటల కుమ్మక్కు.. టీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
గూడు లేని చెంచులు
ఏండ్ల తరబడి నిలువ నీడలేక, తలదాచుకోవడానికి గూడు లేని చెంచులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటిడిఎ పరిధిలోగల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని దీనితో కలిపి గిరిజనులకు ఇంతవరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఇండ్లకు తక్షణమే లబ్దిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: IPL Star Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ క్రికెటర్