Jogulamba Temple: ఐదవ శక్తి పీఠంగా పేరుగాంచిన జోగులాంబ ఆలయంలో ఎంతో నిష్టతో పూజలు చేయాల్సిన అర్చకులు ఎమ్మెల్యే వ్యవహారంలో ఇప్పటికే ఒకరిపై వేటు పడి తిరిగి విధుల్లోకి రాగా తాజాగా ప్రైవేట్ కార్యక్రమాలలో సైతం పాల్గొనడంతో ఆలయ ఓ బదిలీ కాగా ముగ్గురు ఆర్చకులు సస్పెన్షన్ కు గురయ్యారు. ప్రస్తుతం ఇదే అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో ఆలయ ఈవో ఓ అర్చకుని తో మాట్లాడిన ఆడియో సంభాషణ వైరల్ అవుతుంది.
పవిత్ర ఆలయానికి రాజకీయరంగు
శక్తి పీఠాలలో ప్రసిద్ధిగాంచిన అలంపూర్ లో జోగులాంబ అమ్మవారు,బాల బ్రహ్మేశ్వర ఆలయాలు ఎంతో విశిష్టతతో కూడిన ఆలయాలుగా భావిస్తూ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంటారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో అర్చకుల ఆధిపత్య ధోరణి నడుస్తోంది. ఇందులో తమకు అనుకూలంగా ఉన్న స్థానిక రాజకీయ పార్టీ నాయకులను ఎంచుకోవడం వారి నిబద్ధతపై భక్తులు మండిపడుతున్నారు. అధికారంలో ఉండే పార్టీలు ఆలయానికి పాలకమండలిని నియమిస్తున్నా ప్రధాన నాయకులు ఆలయ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు. అటు కొందరు అర్చకులు సైతం వారి మెప్పుకోసం పాకలాడుతున్నడంతో ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వారి వ్యవహారం కొనసాగుతోంది.
అర్చకుడి పేరుతో విఐపిల మెప్పు
జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడుగా చలామణి అవుతూ అర్చకుడి వృత్తిని అడ్డం పెట్టుకుని విఐపి ల ప్రాపకం కోసం వారికి ఆలయ మర్యాదలతో ఎర్ర తివాచి పరిచి జోగులాంబ అమ్మవారిని దర్శనం చేయించి వారితో సాహిత్యాన్ని పెంచుకుంటూ వారు ఇచ్చే కానుకలను గుట్టుగా కానిస్తున్నారన్న విమర్శలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలకు, వస్తువులకు ఆలయ రికార్డులలో నమోదు చేయకుండా తీసేసుకుంటున్నారని అపవాదు ఉంది. జోగులాంబ ఆలయ ప్రతిష్టతను భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయ సంపదను దోచుకుంటున్నారని ఏకంగా ధార్మిక సంస్థలు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనరేట్ ముందు ధర్నా చేశారు.
కొన్ని నెలల క్రితం అలంపూర్ ఎమ్మెల్యే కర్నూల్ లో ఫ్యామిలీతో సినిమా చూస్తుండగా ముఖానికి మాస్క్ పెట్టుకుని గుర్తు పట్టకుండా వారి ఫోటోలు తీస్తున్నాడని గ్రహించిన ఎమ్మెల్యే కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు. ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఏకంగా శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం సస్పెండ్ చేశారు. ఆ అర్చకుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ప్రస్తుతం విధులలో కొనసాగుతున్నారు.
Also Read: Rajinikanth : రజనీకాంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు..
వైరల్ అవుతున్న ఈ.వో అర్చకుడి ఆడియో సంభాషణ
ఇటీవల డోన్ లో స్థానిక ఎమ్మెల్సీ(MLC) సోదరుడి కూతురితో మాజీ మంత్రి కుమారునితో వివాహమైంది. ఈ సందర్భంగా జరిగిన రిసెప్షన్ కు జోగులాంబ అమ్మవారి వీఐపీ(VIP)లకు గని బ్యాగులో ఇచ్చే లడ్డూలతో పాటు శాలువాలు, కండువాలు అమ్మవారి చీరలు తీసుకపోవాలని ఓ ఆర్చకుడికి ఫోన్ లో సూచిస్తున్న ఆడియో సంభాషణ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజా ప్రతినిధి సంబంధికుడు ఆలయ ఈవోకు ఫోన్ చేయడంతో నాకు ఈవో ఫోన్ చేసి ప్రైవేట్ రిసెప్షన్కు తీసుకుపోవాల్సిన వస్తువుల గురించి చెబుతున్నారని ఆలయ అర్చకుడు చెబుతున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆలయ ఈవోకు తెలియకుండా వెళ్లారని ప్రచారం చేస్తున్నారని ఆలయ ఈవో చెప్తేనే మేము వెళ్ళామంటున్నారు.
మాకు ఈ ప్రజా ప్రతినిధి ముఖ్యమని దేవాదాయ సంఘంతో అవసరం లేదని ప్రచారం చేస్తున్నారని, ఆలయంలో రోజు వారి పూజకార్యక్రమాలలో ఎంతో బాధ్యతతో, భక్తి భావంతో మెలుగుతున్న తమను, మా వివరణ తీసుకోకుండా ఈ విధంగా ప్రచారం చేయడం శోచనీయమన్నారు. షోకాజ్ నోటీసులను సైతం హడావిడిగా అందజేసి సంతకం తీసుకున్నారని, మా ఇంటి గోడలకు సైతం నోటీసులు అంటించారని, 48 గంటలలో సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం ఉన్నా మాకు ఈ వో నోటీస్ ఇచ్చి సంతకాలు తీసుకున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలకమండలి చిత్తశుద్ధితో ఐదవ శక్తిపీఠ ప్రతిష్టను పెంచేలా భక్తులకు సౌకర్యాలు కల్పించ్చు.
Also Read: Congress: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో వరుస రాజీనామాలు.. కారణాలు ఇవే