Bhatti Vikramarka: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి విపత్తు సంభవించినా ఎదుర్కోవడానికి 73 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)మల్లు పేర్కొన్నారు. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి భట్టి మాట్లాడారు. సీతారామ ఎత్తిపోతల పథకం(Sitarama Lift Irrigation Scheme) ద్వారా మూడు పాయింట్ 28 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతిని కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మహిళలు మరింత ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు మహిళా సంఘాల సభ్యులకు ఇసుకరీచుల నిర్వహణను సైతం అప్పగించామని తెలిపారు.
Also Read: Balakrishna: బస్సు నడిపిన బాలయ్య.. నీ టాలెంటే వేరయ్యా!
రాష్ట్రంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం పైలెట్ ప్రాజెక్టుగా 38 సబ్ స్టేషన్లలో ఆటోమేషన్ పనులను ఏర్పాటు చేశామన్నారు. బోనకల్ మండలంలోని 22 గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్ స్కీం కింద ఎంపిక చేశామన్నారు. ఇందిరా సౌర గిరిజల వికాస్ పథకం కింద రాబోయే మూడు సంవత్సరాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11,785 గిరిజన రైతులకు 27,447 ఎకరాలకు నిరంధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
వరాల జల్లు!
భూభారతి చట్టం కింద మూడు విడతల్లో జిల్లాలో ఉన్న 21 మండలాల్లో 380 రెవెన్యూ గ్రామాల్లో భూ సమస్యలపై 74,959 దరఖాస్తులు స్వీకరించి భూభారతి పోర్టర్లో నమోదు చేశామన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి సిటీ స్కాన్, 2డీ ఎకో, 20 వెంటిలేటర్లు అందుబాటులో పెట్టామన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణం పనులు, రూ.130 కోట్లతో మెడికల్ కళాశాల భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.139 కోట్లతో పది.. రెండు వరసల రహదారులను, నాలుగు వరసల రహదారులుగా విస్తరిస్తామన్నారు.
గనుల శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.101.78 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు. డీఎంఎఫ్‌టి నిధుల కింద రూ.298 కోట్లతో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆలేరు లేక్ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరి, నేలకొండపల్లి బౌద్ధ స్తూపాల అభివృద్ధికి రూ.2.50 కోట్ల మంజూరి, ఖమ్మం జిల్లా రోప్ వే, పర్యాటకుల సౌకర్యార్థం రూ.29 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
Also Read: Khammam: రద్దయిన రైళ్ల పునరుద్ధరణకు కృషి చేస్తా: ఎంపీ రఘురాం రెడ్డి