Balakrishna: సూపర్ సిక్స్ హామీలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. ఏపీలోని మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌ను అమలులోకి తెచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఈ హామీ అమలులోకి వస్తుందని కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కానీ, వైసీపీ ప్రభుత్వం దీనిపై నెగిటివ్ ప్రచారం చేస్తూనే ఉంది. అయినా కూడా మహిళల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని అమలులోకి తెచ్చి.. వారి నోరు మూయించారు. ‘స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం’ (Sthree Shakti, Free Bus For Women In AP) పేరుతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ స్కీమ్‌ను చంద్రబాబు (CM Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఇంకా ఇతర మంత్రులంతా కలిసి ప్రారంభించారు.
Also Read- Sir Madam OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌ల ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..
బస్సు నడిపిన బాలయ్య
ఏపీ మహిళలంతా ఈ పథకం అమలుతో ఆనందం వ్యక్తం చేస్తుండగా, హిందూపురం ప్రజలకు బాలయ్య మరో ట్రీట్ ఇచ్చారు. హిందూపురంలో ‘స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం’ను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. హిందూపూరం బస్టాండ్ నుంచి తన క్యాంప్ ఆఫీస్ వరకు బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన బస్సు నడుపుతున్నప్పుడు బస్సులో మహిళా ఫ్యాసింజర్స్ కూడా ఉన్నారు. దాదాపు 2 కి.మీ. మేర బాలయ్య బస్సును నడపడం విశేషం. ఇక బాలయ్యలోని ఈ టాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఇంత టాలెంట్ ఏంటి సామి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు నేర్చుకున్నావ్? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరేమో.. ‘లారీ డ్రైవర్’ సినిమా టైమ్‌లో బాలయ్య ఈ హెవీ వెహికల్ నడపడం నేర్చుకుని ఉంటారనేలా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే.. అక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ పథకం ప్రారంభించి ఎంత ఫేమస్ అయ్యారో.. దాదాపు అంతే స్థాయిలో బాలయ్య కూడా ఇలా బస్సు నడిపి సోషల్ మీడియా అటెన్షన్ పొందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read- ChatGPT Advice: చాట్‌జీపీటీ చెప్పింది గుడ్డిగా నమ్మిన దంపతులు.. చివరకు ఊహించని ట్విస్ట్
మరో వైపు ఈ ‘స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం’ ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఉండవల్లి గుహల వద్ద నుంచి విజయవాడ సిటీ టెర్నినల్ వరకు వారు బస్సులో ప్రయాణించి, ఈ పథకంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ప్రారంభించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా చంద్రబాబు పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య
హిందూపురంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చౌడేశ్వరి కాలనీ వరకు బస్సును నడిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ#NandamuriBalakrishna #AndhraPradesh pic.twitter.com/Cygq0Kv74r
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు