Viral Video (Image Source: Twitter)
Viral

Viral Video: పూరి ఆలయంలో అద్భుతం.. జెండా పట్టుకున్న హనుమాన్.. వీడియో వైరల్!

Viral Video: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం.. వింతలు, విశేషాలకు గత కొంతకాలంగా కేరాఫ్ గా నిలుస్తోంది. ఈ క్రమంలోనే పంద్రాగస్టు సందర్భంగా ఆలయంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జాతీయ జెండాను పట్టుకొని ఓ కోతి (Monkey) ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘హనుమంతుడు జాతీయ జెండాను పట్టుకున్నారు’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

వీడియోలో ఏముందంటే?
పంద్రాగస్టు సందర్భంగా పూరిజగన్నాథ్ వద్ద ఓ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. దాని వద్దకు చేరుకున్న ఓ వానరం.. త్రివర్ణ పతకం వద్దే కూర్చుండిపోయింది. చాలా సేపు త్రివర్ణ పతాకం వద్దే కోతి ఉండిపోవడంతో స్థానికులు.. ఆ వానరాన్ని తమ కెమెరాల్లో బందించారు. సరిగ్గా పంద్రాగస్టు రోజున ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకోవడంతో నెటిజన్లు దీన్ని వైరల్ చేస్తున్నారు. హనుమంతుడు సైతం త్రివర్ణ పతాకాన్ని గౌరవించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

ఆలయ గోడలపై బెదిరింపు సందేశాలు
ఇదిలా ఉంటే ఒడిశా పూరి ఆలయంలో ఇటీవల కొన్ని వివాదస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆలయానికి సమీపంలోని బుద్ధి మా ఠాకురానీ ఆలయ గోడలపై ‘టెర్రరిస్టులు ఆలయాన్ని ధ్వంసం చేస్తారు’, ‘కుల బుదిబా’ వంటి బెదిరింపు సందేశాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు అనంతరం రఘునాథ్ సాహు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి మానస సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read: MLA Naseer: టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్ దుమారం.. మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం!

డ్రోన్ ద్వారా వీడియో రికార్డింగ్ కలకలం
ఈ ఏడాది మేలో శ్రీ జగన్నాథ ఆలయం పైన నో-ఫ్లై జోన్‌గా ఉన్నప్పటికీ ఒక డ్రోన్ ద్వారా ఆలయంలో జెండా మార్పిడి ఆచారం (చునారా సేవక్ చేత) వీడియో తీశారు. ఇది నెట్టింట వైరల్ కావడంతో ఆలయ భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు సైతం తీసుకున్నారు.

Also Read: Canadian women: పదేళ్ల క్రితం చూపు కోల్పోయిన మహిళ.. పన్ను తీసి కళ్లు తెప్పించిన వైద్యులు!

అనధికార ఫోటోగ్రఫీ
ఈ ఏడాది జనవరిలో గౌరవ్ కుమార్ సాహు అనే వ్యక్తి ఆలయంలోని కీర్తన చకడా (ఇన్నర్ కోర్ట్‌యార్డ్) ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి వైరల్ కావడంతో భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం భద్రతా వైఫల్యాన్ని మరోమారు తెరపైకి తీసుకొచ్చింది.

Also Read: Khazana Jewellers Robbery: ఖజానా దోపిడి దొంగలు మామూలోళ్లు కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డీసీపీ!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్