Khammam District( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు

Khammam District: ఆ నియోజకవర్గంలోని పీఏ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. నియోజకవర్గంలోని ప్రజల బాగోగులు చూసుకొని అండగా నిలవాల్సిన మంత్రి పీఏ అడ్డంగా మాట్లాడుతూ పనులకు దూరంగా ఉంటున్నాడు. ఇదేమని అడిగితే ఎవరికి చెప్పుకుంటారో..? చెప్పుకోండని హుంకరిస్తున్నాడని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్(BRS) పాలనలో ప్రజలకు సరైన సేవలు అందించడంలో విఫలమవడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress)ను ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయ పీఏ ప్రజలను పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ దాటవేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రాఘవ పీఏ నా లేదంటే షాడో మంత్రి నా ప్రజలు తేల్చుకోలేక పడుతున్నారు.

 Also Read: Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

క్యాంపు కార్యాలయంలో చక్క పెట్టాల్సింది పోయి ఖమ్మం లో ఏం పని..?
కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంటేనే నిరుపేదలకు అండదండలు అందించే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అంటేనే మీరు పేదల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో గత పాలకులు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. గత బీఆర్ఎస్(BRS)పాలనను సహించలేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అహంకారపు మాటలు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసే నైజం కోల్పోయిన నాయకులను నియోజకవర్గాలకు దూరం పెట్టారు.

నిరుపేదలను ఆదుకునే నాయకులనే ఎన్నుకోవాలని కాంక్షతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చెందిన వారిని గెలిపించారు. అయితే రాష్ట్రంలో కేటగిరి-2 పేర్లలో ప్రథమంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లా (Khammam District) పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Pongileti Srinivas Reddy) ఉంటారన్నది జగమెరిగిన సత్యం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) చేపట్టే కార్యక్రమాలను తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు చేసుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పాలేరు నియోజకవర్గ పీఏ ఆగడాలతో చెడ్డ పేరు మూట కట్టుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఫామ్ హౌస్ పాలనపై పలుమార్లు మాట్లాడే మంత్రి పొంగిలేటి పాలేరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్ వల్ల నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

పనులు కాక నియోజకవర్గ ప్రజల ఇబ్బంది
దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించడం లేదని సామెత ఇక్కడ అచ్చంగా వర్తిస్తుంది. ఎందుకంటే పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచిన పొంగిలేటికి ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం. నాడు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన ప్రజలను ఆదరిస్తూ, ఆదుకుంటూ వచ్చారు. దాంతోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి పట్టు ఉంది. ఆ నేపథ్యంలోనే 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పది నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని సవాల్ విసిరారు.

సవాల్ విసడమే కాదు అక్షరాల అనుకున్నట్టుగానే సాధించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా ఖమ్మం నాయకులకు ఉన్న క్రేజీ మరే జిల్లా నాయకులకు లేదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే పొంగిలేటి అంటే ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే మనిషి ప్రతి ఇంట్లో శీనన్న పేరు మారుమోగుతూ ఉంటుంది. అట్లాంటి శ్రీనన్న నియోజకవర్గంలో ప్రజలు పీఏ ఆగడాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి చేదోడు బాదోడుగా పని చేయాల్సిన పిఏ ఖమ్మం జిల్లా (Khammam District) కేంద్రంలో ఉంటూ ప్రజలకు ఇబ్బందులను సృష్టిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ సంక్షేమ పథకాలకు ఆర్జీ పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఏ అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. పాలేరు క్యాంపు కార్యాలయ పిఏ ప్రజలకు 24/7 ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Pongileti Srinivas Reddy)కి నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు