Universal Creation Test Tube Center imagecredit:swetcha)
హైదరాబాద్

Universal Creation Test Tube Center: పేద మహిళలే టార్గెట్.. సరోగసి ఉచ్చులోకి లాగి లక్షల్లో సంపాదన?

Universal Creation Test Tube Center: తొండ ముదిరి ఊసరవెల్లిగా మారిందన్న చందాన అద్దెకు గర్భం ఇచ్చిన ఓ మహిళ డబ్బు సంపాదించటానికి కొడుకుతో కలిసి సరోగసి దందా మొదలు పెట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్((Hyderabad)) లోని పలు సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులతో సంబంధాలు ఏర్పరుచుకుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపించి ఉచ్ఛులోకి లాగుతూ వారిని సరోగేట్ తల్లులుగా మార్చింది. దాంతోపాటు అండాలను అమ్మిపిస్తోంది. ఈ మేరకు పక్కగా సమాచారాన్నిసేకరించిన పేట్​ బషీరాబాద్ పోలీసులు(Basheerabad Police) తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు.

వీరి వలలో చిక్కి సరోగేట్ తల్లలుగా మారిన ఆరుగురు మహిళలను గుర్తించారు. వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్(Universal Creation Test Tube Center) కేసు సృష్టించిన సంచలనం సద్దుమణగక ముందే వెలుగు చూసిన ఈ రాకెట్ మరోసారి కలకలం సృష్టించింది. మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి(DCP N Koti Reddy) మీడియా సమావేశంలో ఎస్వోటీ డీసీపీ పీ.శోభన్ కుమార్, అదనపు డీసీపీ ఏ.విశ్వప్రసాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ సీ.ఉమాగౌరి, ఏసీపీ బాల గంగిరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.

కుత్భల్లాపూర్ చింతల్ ప్రాంత వాస్తవ్యురాలైన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి (45) గృహిణి. నిరుపేద కుటుంబం కావటంతో లక్ష్మీరెడ్డి గతంలో వేర్వేరు సంతాన సాఫల్య కేంద్రాలకు తన అండాలను డబ్బుకు అమ్ముకోవటంతోపాటు సరోగేట్ తల్లిగా మారింది. ఈ క్రమంలో ఇదే దందాలో ఉన్న పలువురు ఏజెంట్లతోపాటు సంతాన సాఫల్య కేంద్రాలు, క్లినిక్ ల నిర్వాహకులతో ఆమెకు పరిచయాలు ఏర్పడ్డాయి.

డబ్బు కోసం

అండాలను విక్రయించటం…సరోగేట్ తల్లిగా మారిన నేపథ్యంలో ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు చేతికి అందటంతో లక్ష్మీరెడ్డి ఇదే దందా చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో జేఎన్​టీయూ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివి నిరుద్యోగిగా ఉన్న నరేందర్ రెడ్డి (27)ని తన పథకంలో భాగస్వామిగా చేసుకుంది.

Also Read: AISF: స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవాగ్నిని రగిలించిన నిప్పుకణం

డబ్బు ఆశ చూపించి

ఆ తరువాత నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలను గుర్తించి వారితో పరిచయాలు పెంచుకోవటం మొదలు పెట్టింది. కాస్త సన్నిహితమైన తరువాత అండాలను అమ్మినా…గర్భాన్ని అద్దెకు ఇచ్చినా దండిగా డబ్బు సంపాదించ వచ్చని వారిని ప్రలోభ పెట్టి తన దారిలోకి తెచ్చుకోవటం ఆరంభించింది. దీని కోసం కొందరు ఏజెంట్లను కూడా పెట్టుకుంది. ఇలా కర్ణాటక రాష్ట్రం బీదర్ కు చెందిన గోల్కొండ సాయిలీల (39), ఆంధ్రప్రదేశ్​ రంపచోడవరం ప్రాంత వాస్తవ్యులైన సదాల సత్యవతి (29), మలగల్ల వెంకట లక్ష్మి (30), అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన పీ.సునీత (23), విజయనగరం జిల్లాకు చెందిన పీ.అపర్ణ (30), రమణమ్మ (39)లను అండాలు ఇవ్వటానికి…సరోగేట్ తల్లులుగా మారటానికి ఒప్పించింది.

ఇంట్లోనే ఆశ్రయమిస్తూ

తాను సాగిస్తున్న అక్రమాలు బయట పడకుండా ఉండేందుకు లక్ష్మీరెడ్డి(Laxmi Reddy) పలు జాగ్రత్తలుత తీసుకుంది. ఈ క్రమంలో అండాలు ఇవ్వటానికి, అద్దె తల్లులుగా మారటానికి అంగీకరించిన వారికి ఆన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తూ వచ్చింది. మాదాపూర్ లోని హెగ్డే ఫర్టిలరీ సెంటర్, సోమాజీగూడలోని అనూ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బంజారాహిల్స్ లోని ఫర్టీకేర్​, ఈవా ఐవీఎఫ్(Iva IVF Center)​, అమూల్య ఐవీఎఫ్​ సెంటర్(Amulya IVF Center)​, కొండాపూర్​ లోని శ్రీ ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులతో సంబంధాలు ఏర్పరుచుకుంది. బిడ్డ కోసం పరితపిస్తున్న వారి వీర్యకణాల ద్వారా తన వద్దకు వచ్చిన మహిళలను గర్భవతులను చేస్తూ వచ్చింది.

పిల్లలు పుట్టిన తరువాత శిశువులను ఆయా సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులకు అప్పగించి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకోవటాన్ని కొనసాగింది. కాగా, లక్ష్మీరెడ్డిని జరిపిన విచారణలో వెలుగు చూసిన సంతాన సాఫల్య కేంద్రాల పాత్ర ఈ కేసులో ఏ మేరకు ఉందన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో కమర్షియల్ సరోగసి నిషిద్ధమని చెప్పారు. బయటపడ్డ సంతాన సాఫల్య కేంద్రాలకు అక్రమాల్లో పాత్ర ఉన్నట్టు పూర్తిగా నిర్ధారణ అయితే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాన నిందితురాలైన లక్ష్మీరెడ్డిని ఇలాంటి కేసులోనే 2024లో ముంబయి సీఐడీ యూనిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. బెయిల్ పై విడుదలైన తరువాత లక్ష్మీరెడ్డి తిరిగి తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చినట్టు తెలిపారు.

శభాష్​

లక్ష్మీరెడ్డి సాగిస్తున్న అక్రమాల గురించి పక్కగా సమాచారాన్ని సేకరించిన మేడ్చల్​ జోన్​ ఎస్వోటీ అధికారులు, జిల్లా వైద్య శాక అధికారులతో కలిసి దాడులు నిర్వహించి లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిలతోపాటు సరోగేట్ తల్లులుగా మారటానికి ఒప్పుకొన్న మరో ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6.47లక్షల రూపాయల నగదు, ల్యాప్ టాప్​, ప్రామిసరీ నోట్లు, నాన్ జ్యుడిషియల్ బాండ్​ పేపర్లు, సిరంజీలు, ప్రెగ్నెన్సీ మందులు, హార్మన్ ఇంజక్షన్లు, సాయిలీల, నేహాలకు హెగ్డే హాస్పిటల్ నుంచి ఇచ్చిన కేస్ షీట్లు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 38, 39, 40, 41, రీప్రొడక్టీవ్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 33, 34, బీఎన్​ఎస్​ యాక్ట్ సెక్షన్​ 318(4), 61(2) ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు సిబ్బందిని డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.

Also Read: Indiramma Houses: నెలాఖ‌రులోగా ఇందిర‌మ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?