Bhuvaneswar on Bumrah
Viral, లేటెస్ట్ న్యూస్

Bhuvneshwar Kumar: బుమ్రా ‘వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌’పై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు

Bhuvneshwar Kumar: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం 5 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే ఆడాడు. అతడిపై శారీరక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలో భాగంగా, ముందే నిర్ణయించినట్టుగా 3 మ్యాచ్‌లే ఆడాడు. ఆతిథ్య జట్టు సీరిస్‌లో 2-1 ముందజలో ఉన్న సమయంలో చివరిదైన ఐదవ టెస్ట్‌లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం తీవ్ర విమర్శల పాలైంది. పలువురు క్రికెట్ నిపుణులు, భారత జట్టు అభిమానాలు విమర్శలు గుప్పించారు. భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం జస్ప్రీత్ బుమ్రా విషయంలో అనుసరించిన ‘వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్’ను (Bhuvneshwar Kumar) సమర్థించాడు.

Read Also- Dogs in Countries: కుక్కలు ఎక్కువగా ఉన్న టాప్-10 దేశాలు ఇవే

బుమ్రా బౌలింగ్‌ శైలి కారణంగా కొన్ని గాయాలవ్వడం సహజమేనని, అతడు చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తించాలని, అన్ని ఫార్మాట్లలోనూ కొన్నేళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. ‘‘బుమ్రా చాలా ఏళ్లుగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. ఈ విధంగా ఆడటం ఎవరికైనా కష్టమే. బుమ్రా బౌలింగ్‌ శైలిని బట్టి కొన్ని గాయాలు కావొచ్చు. అది అతడికి మాత్రమే కాదు, ఎవరికైనా జరగొచ్చు. 5 మ్యాచ్‌లలో మూడు ఆడటంలో నాకు ఎలాంటి సమస్యా కనిపించడం లేదు’’ భువనేశ్వర్ కుమార్ వ్యాఖ్యానించాడు.

Read Also- Karun Nair on Gambhir: ఎట్టకేలకు కోచ్ గంభీర్‌పై నోరువిప్పిన ఆటగాడు

బుమ్రా ఇంగ్లండ్ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడకపోయినా, జట్టుకు అతడు అందించిన సహకారాల దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు చక్కటి నిర్ణయం తీసుకునేవారేమోనని భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. ‘‘బుమ్రా ఎలాంటి ప్రదర్శన ఇవ్వగలడో సెలెక్టర్లు తెలుసు. ఆడిన ఆ మూడు మ్యాచ్‌లలో గట్టి ప్రభావం చూపగలడని వారికి నమ్మకం ఉంది. ఇది చాలా మంచిదనే చెప్పాలి. ఒక ఆటగాడు 5 మ్యాచ్‌లూ ఆడకపోయినా 3 మ్యాచ్‌లలో గొప్ప సహకారం అందిస్తే అది అందరికీ అంగీకారంగా అనిపించాలి. కానీ, చాలా ఏళ్లుగా అన్ని ఫార్మాట్లలో ఆడటం ఎంత కష్టమైనదో అందరూ అర్థం చేసుకోలేరు. ఆటగాడిపై ఒత్తిడి కూడా ఉంటుంది. ఏ ఆటగాడినైనా ఎక్కువ కాలం ఆడించాలనుకుంటే, అతడి విషయంలో నిర్వహణ బాగుండాలి. అందుకే, నాకు బుమ్రా విషయంలో ఎలాంటి సమస్యా అనిపించడం లేదు’’ అని భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు.

కాగా, జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ 2025లో ఆడే అవకాశం ఉంది. అయితే, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా, ఆసియా కప్ తర్వాత వెస్ట్ ఇండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read Also- ChatGPT Advice: చాట్‌జీపీటీ చెప్పింది గుడ్డిగా నమ్మిన దంపతులు.. చివరకు ఊహించని ట్విస్ట్

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్