Dog Population
Viral, లేటెస్ట్ న్యూస్

Dogs in Countries: కుక్కలు ఎక్కువగా ఉన్న టాప్-10 దేశాలు ఇవే

Dogs in Countries: భారతదేశంలో సుమారు 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా. ఈ పెరుగుతున్న కుక్కల జనాభా సమస్యను పరిష్కరించేందుకు భారత్ కీలక చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 70 శాతానికి పైగా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ (వంధ్యత), టీకాలు వేయడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. భారత్‌లో కుక్కల సంఖ్య వేగంగా పెరుగుతోందని కొన్ని రిపోర్టులు చెబుతున్న నేపథ్యంలో, జనాల రక్షణ, కుక్కల సంఖ్య నియంత్రణ కోసం ఈ దిశగా చర్యలు తీసుకోబోతోంది.

మరి, భారత్‌లోనే అత్యధిక కుక్కలు ఉన్నాయా?, ఇతర దేశాల్లో ఈ సమస్య లేదా?.. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే అత్యధికంగా శునకాలు ఉన్న టాప్-10 దేశాల (Dogs in Countries) గురించి తెలుసుకోవాల్సిందే. వరల్డ్‌అట్లాస్ (WorldAtlas) వివిధ దేశాల ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్‌లో కంటే ఎక్కువ కుక్కలు ఉన్న దేశాలు ఏకంగా మూడు ఉన్నాయి. ఆ దేశాలు ఏవో ఒకసారి పరిశీలిద్దాం…

10. రొమేనియా
రొమేనియా దేశంలో సుమారుగా 41 లక్షల కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1980వ దశకంలో ఆ దేశంలో కుక్కలు బాగా పెరిగాయి. ఎందుకంటే, ఆ సమయంలో గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణాలకు తరలివెళ్లారు. పెంపుడు కుక్కలను వదిలేసి వెళ్లడంతో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒకానొక సమయంలో కుక్కలను పెద్ద సంఖ్యలో చంపేయాల్సి వచ్చింది. కానీ, పెటా వంటి హక్కుల సంఘాల తీవ్రంగా వ్యతిరేకించాయి.

9. ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో సుమారుగా 74 లక్షల కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి కుక్కకు గుర్తించేందుకు ఒక మైక్రోచిప్ తప్పనిసరిగా ఉంటుంది. టీకా నిబంధనలు చాలా కఠినంగా ఉండడంతో రేబీస్ కేసులు ఆ దేశంలో చాలా తక్కువగా ఉంటాయి. రేబీస్ కేసులు తక్కువగా ఉన్నా కుక్కల సంఖ్య మాత్రమే ఏడాది పెరుగుతూనే ఉంది.

8. అర్జెంటీనా
అర్జెంటీనాలో ఏకంగా 92 లక్షల కుక్కలు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లలో కూడా పెంపుడు జంతువులను పెంచుకునే సంస్కృతి అక్కడి పెరిగిపోతోంది. బ్రెజిల్ ప్రభుత్వం చేపడుతున్న స్టెరిలైజేషన్, టీకా కార్యక్రమాలు కుక్కల సంఖ్య నియంత్రణకు దోహదపడుతున్నాయి.

7. ఫిలిప్పీన్

ఫిలిప్పీన్స్‌లో 1.16 కోట్ల కుక్కలు ఉంటాయని అంచనాగా ఉంది. గతంలో రేబీస్ సంబంధిత మరణాలు ఆ దేశానికి తీవ్ర సమస్యగా మారి ఇబ్బంది పెట్టాయి. అయితే, ప్రస్తుతం అక్కడ కుక్కలను చంపడానికి బదులుగా స్టెరిలైజేషన్, టీకా కార్యక్రమాల ద్వారా కుక్కలను నియంత్రిస్తున్నారు.

Read Also- Karun Nair on Gambhir: ఎట్టకేలకు కోచ్ గంభీర్‌పై నోరువిప్పిన ఆటగాడు

6. జపాన్
జపాన్‌లో కుక్కల సంఖ్య 1.2 కోట్ల పైమాటే. కొందరు జపాన్ పౌరులు పిల్లల్ని కనడం మానేసి, పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కుక్కలను కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు. జపాన్‌లో పెంపుడు జంతువుల మార్కెట్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది.

5. రష్యా
రష్యాలో సుమారుగా కోటిన్నర కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీధి కుక్కల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. పౌరులు, ప్రభుత్వాధికారులు ఉమ్మడిగా ఆహారం, వైద్యం అందిస్తున్నారు.

4. భారత్
భారత దేశంలో 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. స్టెరిలైజేషన్, టీకాల ద్వారా కుక్కల సంఖ్యను నియంత్రించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వచ్చే ఏడాది 70 శాతం కుక్కలకు టీకాలు, స్టెరిలైజ్ చేయాలనే ప్రణాళికతో ఉంది.

3. చైనా
చైనాలో కుక్కల సంఖ్య 2.74 కోట్ల పైమాటే. పెట్ డాగ్స్ పెంపకం చైనాలో వేగంగా పెరిగిపోతోంది. గతంలో బీజింగ్ వంటి నగరాల్లో కుక్కల పెంపకంపై పరిమితులు విధించారు. ప్రస్తుతం ఆ నిబంధనలను సడలించారు. దీంతో, పెంపుడు జంతుల మార్కెట్ అక్కడ వేగంగా వృద్ధి చెందుతోంది.

Read Also- ChatGPT Advice: చాట్‌జీపీటీ చెప్పింది గుడ్డిగా నమ్మిన దంపతులు.. చివరకు ఊహించని ట్విస్ట్

2. బ్రెజిల్

బ్రెజిల్‌లో సుమారు 3.57 కోట్ల కుక్కలు ఉన్నాయి. దేశంలోని సగం కుటుంబాలకు కుక్కలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదని గణాంకాలు చెబుతున్నాయి. కుక్కలకు టీకాలు, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటి పలు ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ కొనసాగుతున్నాయి.

1. అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 7.58 కోట్ల కుక్కలు ఉన్నాయి. ఆ దేశంలో డాగ్ పార్కులు, గ్రూమింగ్ సర్వీసులు, కఠినమైన జంతు సంరక్షణ చట్టాలు ఉన్నాయి. జంతువుల పట్ల క్రూరత్వానికి వ్యతిరేకంగా పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. కాగా, అత్యధిక శునకాలు ఉన్న టాప్-10 దేశాలకు చెందిన గణాంకాల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కలిపి ఉన్నాయి.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు