Mp Etela Rajender: హైదరాబాద్‌లోని ఉప్పల్ లో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్(Basavatarakam Indo-American Cancer Hospital) వారు నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన మరియు ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్(Free cancer screening) కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) పాల్గోన్నారు. నేను హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కరోనా టైమ్ కాబట్టి సంపూర్ణంగా పని చేసే అవకాశం లేకపోయిందని ఈటల రాజేందర్ అన్నారు. MNJ క్యాన్సర్ హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్(Nims Hospital)స్ లో లేటెస్ట్ కొత్త పరికరాలను తీసుకొచ్చి పెట్టామని అన్నారు. సీఎస్ఆర్(CSR) ఫండ్ కింద 40 కోట్లతో కొత్త హాస్పిటల్ కట్టించామని తెలిపారు.
శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు
ప్రస్థుతం అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల వస్తున్నాయి. మనం టెస్ట్ చేసుకుంటే తప్ప బయటపడే ప్రసక్తి లేదు కాబట్టి మనం తప్పకుండా ఈ క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్(Cancer Screen Test) చేసుకోవాలని అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నామని తెలిపారు. తాను ఎంపీ అయిన తర్వాత సీఎస్ఆర్(CSR) ఫండ్ కింద కోటి రూపాయలు వస్తే వాటితో నాలుగు స్క్రీనింగ్ మిషన్లు తీసుకోవడం జరిగిందని అన్నారు. నేడు సమాజంలో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణలు వచ్చాయి కాబట్టి చిన్న మిషన్‌తో కూడా కాన్సర్‌ను గుర్తించవచ్చని అన్నారు. ఈ మధ్య కాలంలో కిడ్నీ(Kidni), లంగ్(Lunks), మౌత్ క్యాన్సర్లు(Mouth Cancer) ఎక్కవయ్యాయని అన్నారు. నయం కావడానికి ప్రస్థుతం 30, 40 లక్షలు ఖర్చుపెట్టిన కూడా ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. కాన్సర్‌కు చిన్న పెద్ద తేడా లేదు. ఉన్నోళ్లకు వచ్చిన గుడిసెల్లో వారికీ వచ్చిన అదే ఖర్చు అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read: Rahul Gandhi: బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్
బసవతారకం ఇన్స్టిట్యూట్
ఈ మధ్య కాలంలో మహిళలకు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ ఇంకా రకరకాల క్యాన్సర్ ఎక్కువ మందిలో చూస్తున్నామని, ఇవాళ కుటుంబాన్ని కంటికి రెప్పాల చూసుకునే వాళ్ళు మహిళలు మాత్రమే, ఆ మహిళలు కుటుంబంలో లేకపోతే అందకారంగా మారే ఆస్కారమయ్యే అవకాఫం ఉందని అన్నారు. బసవతారకం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసేదే కాకా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఈ స్క్రీనింగ్ మిషన్ల కోసం, ట్రీట్మెంట్ కోసం మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read: Gold Rate Today: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
