Independence Day ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Independence Day: తొర్రూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ జెండాకు అవమానం

Independence Day: స్వతంత్ర దినోత్సవం రోజే జాతీయ పతాకానికి అవమానం జరిగిందనీ తొర్రూరు లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 15 సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేడుకలో 100 అడుగుల జెండాను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) ఆవిష్కరించారు. అయితే ఆ జెండా ఇప్పటికే చినిగిపోయినదని, చినిగిన పతాకాన్ని ఎగరేయడం దేశ గౌరవానికి తూట్లు పొడిచినట్టేనని ప్రజలు మండిపడుతున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

చినిగిన జెండా

స్థానికుల తెలిపిన ప్రకారం ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం రిటైర్డ్ ఆర్మీ అధికారులు లేదా దేశ సేవ చేసిన ప్రముఖుల చేతుల మీదుగా జెండా ఆవిష్కరించే ఆనవాయితి ఉందట. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడ్డాక నేరుగా ఝాన్సీ రెడ్డి(Jhansi Reddy) చేత పతాకావిష్కరణ జరగడం, అంతే కాక చినిగిన జెండాను ఉపయోగించడం… దేశభక్తుల గుండెల్లో మంటలు రేపిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశ గౌరవం కాపాడాల్సిన రోజే ఇలా అవమానం జరగడం సిగ్గుచేటు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?