PM Modi – GST: దేశ రాజధాని దిల్లీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని.. జాతీయ జెండాను ఎగురవేశారు. ఉదయం 7:21 గంటలకు ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని.. 7:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశానికి అంకితం చేశారు. అనంతరం జాతీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దీపావళి గిఫ్ట్ ను ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే జీఎస్టీ సంస్కరణలు దేశానికి దీపావళి కానుకగా ఉండనున్నాయని ప్రధాని అన్నారు.
ప్రధాని ఏమన్నారంటే?
ఎర్రకోట వేదికగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ దీపావళికి నేను మీకు డబుల్ దీపావళి కానుక ఇస్తాను. పౌరులకు పెద్ద బహుమతి అందుతుంది. మేము నెక్స్ట్ జెనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్‌ను తీసుకువస్తున్నాం. దీని వల్ల దేశవ్యాప్తంగా పన్ను భారం తగ్గుతుంది. ఇది దీపావళికి ముందే మీకు అందించే బహుమతి అవుతుంది’ అని ప్రధాన మంత్రి అన్నారు. 8 ఏళ్ల క్రితం అనేక సంస్కరణలు చేపట్టామని అందులో జీఎస్టీ ప్రధానమైనదని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. గతంతో పోలిస్తే జీఎస్టీ విధానం ద్వారా పన్నుల భారం తగ్గించామని.. ట్యాక్సేషన్ ప్రక్రియను సులభతరం చేశామని పేర్కొన్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, “This Diwali, I am going to make it a double Diwali for you… Over the past eight years, we have undertaken a major reform in GST… We are bringing next-generation GST reforms. This will reduce the tax burden across the… pic.twitter.com/2hAPP0CFtH
— ANI (@ANI) August 15, 2025
Also Read: Ranchander Rao: మరోసారి దేశ విభజన ప్రసక్తే ఉండొద్దు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు
‘సంస్కరణలకు టైమ్ వచ్చింది’
జీఎస్టీ నిబంధనలు సరిగ్గా 2017 జులై 1 అమల్లోకి వచ్చాయి. ఇప్పటికీ 8 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో వాటిని సమీక్షించే సమయం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రాలతో చర్చలు జరిపుతామని పేర్కొన్నారు. ఇప్పటికే కొత్త జీఎస్టీ సంస్కరణలను సిద్ధం చేశామని దేశ ప్రజలకు వివరించారు. ‘సామాన్యులపై పడే వస్తు సేవల భారం.. కొత్త సంస్కరణ ద్వారా గణనీయంగా తగ్గుతాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెద్ద లాభం కలుగుతుంది. నిత్యవసర వస్తువులు చౌకగా లభిస్తాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది’ అని మోదీ చెప్పుకొచ్చారు.
Also Read: Actress: పెళ్ళై పిల్లలున్న డైరెక్టర్ పై మోజు పడుతున్న కుర్ర హీరోయిన్?
‘ఇతరులపై ఎందుకు ఆధారపడాలి’
దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను ఎర్రకోట వేదికగా ప్రధాని ప్రశంసించారు. ‘ఈరోజు ప్రపంచం యూపీఐ అనే ఒక అద్భుతాన్ని చూస్తోంది. రియల్ టైమ్ లావాదేవీలలో 50% కేవలం భారత్‌లోనే UPI ద్వారా జరుగుతున్నాయి. సృజనాత్మక రంగం గానీ, సోషల్ మీడియా గానీ, అన్నీ మనవే ఎందుకు కాకూడదని నేను యువతకు సవాలు విసురుతున్నాను. మనం ఎందుకు ఇతరులపై ఆధారపడాలి? మన సంపద ఎందుకు దేశం బయటికి వెళ్లాలి? మీ సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది’ అంటూ యువతలో ఉత్సాహాన్ని, పట్టుదలను ప్రధాని రగిలించారు.