Ranchander Rao: దేశ సంపదను దోచుకున్న పాకిస్థాన్‌కు, మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టిన బ్రిటీషర్లకు కాంగ్రెస్(Congress) మద్దతు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ranchander Rao) ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గురువారం తిరంగా యాత్రను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, మరోసారి దేశ విభజన ప్రసక్తే ఉండకూడదన్నారు. ఆ సంకల్పంతో భారతదేశ ఐక్యతను, సమగ్రతను, సంస్కృతిని కాపాడేలా తిరంగా యాత్రను చేపడుతున్నట్లు చెప్పారు.
Also Read: J-K Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో భారీ క్లౌడ్ బరస్ట్.. పెద్ద సంఖ్యలో మృతులు!
భారతదేశం ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తి
ఓట్ల చోరీకి సంబంధించి తల్లీ, బిడ్డ కాంగ్రెస్సేనంటూ ఎద్దేవా చేశారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని రాంచందర్ రావు(Ranchander Rao) కోరారు. భారతదేశం ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ, 800 సంవత్సరాల పాటు బ్రిటీషర్లు దేశాన్ని పాలించారని, స్వాతంత్ర్యం లక్షలాది మంది సమరయోధుల త్యాగాలతో ఏర్పడిందన్నారు. అందుకే దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అఖండ భారత్ ముక్కలవడానికి కారణం గత పాలకుల స్వార్థ ప్రయోజనాలేనని ఆయన మండిపడ్డారు.
Also Read: Supreme Court: వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ