Fisheries Department: రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు(Buildings) లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్ల కిందట పనులు ప్రారంభించి, మూడేళ్ల క్రితం పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావడం లేదు. ప్రారంభంలో మరింత జాప్యం జరిగితే భవనాలు శిథిలమై, వ్యయం చేసిన మొత్తం బూడిదిలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉంది. ఇది మేడ్చల్(Medical) మున్సిపాలిటీ పరిధిలోని మత్స్యశాఖ చెందిన స్థలానికి సంబంధించి పరిస్థితి. మేడ్చల్(Medical) పట్టణంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని మత్స్యశాఖకు ఐదెకరాల స్థలం ఉంది. ఇక్కడ గతంలో ఆలంకరణ, ఆహార చేపల కేంద్రాన్ని నిర్వహించే వారు. గత ప్రభుత్వ హయాంలో చేపల కేంద్రాన్ని మత్స్య కళాశాలగా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేశారు. రూ.5.55 కోట్లతో మూడేళ్ల క్రితం మత్స్య కళాశాల నిర్వహణ భవనాల(Buildings)ను నిర్మాణాన్ని పూర్తి చేశారు.
Also Read: SC on EC: 65 లక్షల ఓట్లు ఎందుకు డిలీట్ అయ్యాయి?.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
కుంటలు పూడ్చివేతకు నిధులు
మత్స్య కళాశాల నిర్వహణకు భవనాలు నిర్మించిన చోట ఐదెకరాల స్థలం ఉన్నప్పటికీ వరద నీరు భారీగా నిల్వ ఉంటుంది. ఆ ప్రాంతం కుంటలా కనిపిస్తుంది. ఆ కుంట పూడ్చివేత, రోడ్ల నిర్మాణానికి రూ.2.85 కోట్లు కేటాయించారు. పనులు నిర్వహణ ఇంకా టెండర్ కూడా దాటనట్టు సమాచారం. ఇటీవల మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, టీజీఎఫ్సీవోఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మేడ్చల్(Medical) మత్స్య శాఖ కళాశాల భవనాలను సందర్శించి, చర్చించినట్టు తెలిసింది. ఇంకా కొన్ని రోజులు శిథిలావస్థకు చేరుకుంటాయి. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కొద్ది కొద్దిగా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంటుంది. అధికారులు వెంటనే కళాశాల ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Bigg Boss Agnipariksha: వీడియో లీక్.. ఎందుకంత సీరియస్ అంటూ నవదీప్‌పై కౌంటర్స్!