Jogulamba Gadwal district: జోగుళాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతలు కుంటలను తలపిస్తున్నాయి. ఇక గ్రామాలు, తండాల్లో అయితే రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కిలోమీటర్ల మేర దారులు బురదతో నిండిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాడైన రోడ్ల(Road) తో ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి రెండేండ్లు గడుస్తున్న ఒక్కరూపాయి కూడా రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
గద్వాల జిల్లా కేంద్రంలో..
గద్వాల జిల్లా(Gadwal District) కేంద్రంలో ఏ రోడ్డు(Road) చూసిన గుంతలమయంగా మారాయి. పాతబస్టాండ్ నుంచి, కృష్ణవేణి చౌరస్తా, భీంనగర్, అంబేద్కర్ చౌరస్తా, రెండో రైల్వే గేటు, తదితర ప్రధాన రహదారులు గుంతల మయంగా మారాయి. మేలచెర్చు చౌరస్తా, అయిజ రోడ్డు(Road) పై వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. నిత్యం కలెక్టర్ ఎస్పీలతోపాటు ఉన్నతాధికారులు తిరిగే ప్రధాన రహదారులు కూడా పట్టించుకునే వారే లేరు. ప్రధాన రహదారులు గుంతల మయం గా మారిన సంబందిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అలంపూర్ లోని
మానపాడు మండలం పెద్దవాగు, ఐజ మండలం మేడికొండ రోడ్ పోలోని వాగు బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు(Road) భారీ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఆ మార్గం మీదుగా మంత్రాలయం వెళ్లే అంతరాష్ట్ర రహదారి గుండా రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. దీంతో ఐజ ఎస్సై శ్రీనివాసరావు మట్టి రోడ్డు(Road)ను వేయించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. అదేవిధంగా పెద్ద ధన్వాడ, చిన్న తాండ్రపాడు, తనగల గ్రామాల రాకపోకలకు నీటి ప్రవాహంతో అంతరాయం తలెత్తింది. మల్దకల్ మండల కేంద్రంలోని పలు విద్యాసంస్థలు, రోడ్ల(Road)నపైన గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండి ఇబ్బందులు తలెత్తాయి.
తెల్లవారుజాము నుంచి ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా వర్షలు కురుస్తుండటంతో వాగులు, వంకల్లో భారీగా వరద నీరు చేరాయి. తెల్లవారుజామున కురిసిన వర్షాలతో మరోసారి వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 36 మి.మీ వర్షం కురిసింది. ఉండవెల్లి మండలంలో 27.2 మి.మీ. ఇటిక్యాలలో 25.3 మి.మీ, రాజోలిలో 24.3 మి.మీ, వడ్డేపల్లిలో 21.5 మి.మీ, అయిజలో 16.8 మి.మీ. అలంపూర్లో 15.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలంపూర్
పొంగిన వాగులు, వంకలు
అలంపూర్,(Alampur) మానవపాడు మండలాలలోని పలు వాగులు భారీ వర్షానికి పొంగిపొర్లాయి. రైల్వే అండర్పాస్ బ్రిడ్జిల కింద నీరు నిల్వ ఉండి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాశీపురం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి తన బైక్ తో వాగు దాటే ప్రయత్నం చేయగా. వరద ఉధృతికి బైక్ వాగు మధ్యలోనే నిలిచింది. అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది. గ్రామస్తులు వాగులోకి వెళ్లి అతడిని కాపాడారు. వాగు ఉధృతి పెరుగుతుండటంతో వాహనాల రాకపోకలు కొనసాగించకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. వాగును ఎస్ఐ వెంకటస్వామి సిబ్బందితో కలిసి పరిశీలించారు. బీచుపల్లి(Beachupally) దగ్గర నది ప్రవాహాన్ని, మానపాడు పెధవాగును జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి , వాహనాల రాకపోకలను నేర్పించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు. అనేక యేలుగా వంతెనలు లేక నీటి ప్రవాహంలో రాకపోకలు కొనసాగిస్తూ ఇబ్బందులు పడుతున్నా పాలకులు అధికారులు సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
Also Read:Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా