Warangal MGM Hospital( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Warangal MGM Hospital: వైద్యం కోసం పడిగాపులు.. వరంగల్ ఎంజీఎంలో దారుణం

Warangal MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగి పట్ల జరిగిన దారుణ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన బాచబోయిన రత్నాకర్(Ratnakar) మూడు రోజులుగా వైద్యం కోసం ఆస్పత్రి ఎదుట ఎదురుచూస్తూ ఉన్నాడు. వర్షానికి తడుచుకుంటూ అతని భార్య అతనికి సేవలు అందిస్తున్న దృశ్యాలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ నెల 10న కడుపునొప్పితో ఎంజీఎంకు వచ్చిన రత్నాకర్‌ను, అక్కడి వైద్యులు వైద్య పరీక్షల నిమిత్తం కేఎంసీకి రిఫర్ చేశారు.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

అవసరమైన పరికరాలు లేవు

ఈ నెల 12న వైద్య పరీక్షలు నిర్వహించగా, రత్నాకర్‌కు పైల్స్ సమస్య ఉందని నిర్ధారణ అయింది. దీంతో కేఎంసీ వైద్య సిబ్బంది తిరిగి ఎంజీఎం(MGM)కు పంపించారు. అయితే, ఎంజీఎంకు తిరిగి వచ్చిన తర్వాత పైల్స్ సర్జరీకి అవసరమైన పరికరాలు లేవని చెప్పి బయటకు పంపించారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో మూడు రోజులుగా వైద్యం కోసం రత్నాకర్(Ratnakar) ఎంజీఎం(MGM) ఎమర్జెన్సీ వార్డు ఎదుట పడిగాపులు కాశారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో, వారు బాధితుడి వద్దకు చేరుకుని కథనాన్ని ప్రసారం చేశారు. మీడియా ప్రసారం తర్వాత వెంటనే స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్, హుటాహుటిన రత్నాకర్‌(Ratnakar)ను వార్డుకు తరలించి, పైల్స్ సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సహాయానికి బాధితులు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?