Jogulamba Temple (IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Jogulamba Temple: జోగులాంబ ఆలయ ఈవో బదిలీ.. ముగ్గురు అర్చకులపై సస్పెన్షన్‌ వేటు

Jogulamba Temple: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, దేవాదాయ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా కర్నూల్ లో జరిగిన తెలంగాణకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుని కుమార్తె వివాహ వేడుకలు నిర్వహించి, ఆశీర్వాదాలు అందజేసిన బాధ్యులపై దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జోగులాంబ ఆలయ(‘Jogulamba Temple) కార్యనిర్వాహణాధికారిగా ఉన్న పురేందర్ కుమార్ ను జమ్మిచెడు జములమ్మ ఆలయానికి ఈవోగా బదిలీ చేయగా జోగులాంబ ఆలయ(Jogulamba Temple)ముగ్గురు అర్చకులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు సస్పెన్షన్ కు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వపరంగా వేతనాలు పొందుతూ ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులు, పురోహితులు రాష్ట్రం లేదా విదేశాలలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే లేదా నిర్వహించాలంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతులు ముందుగానే పొందవలసి ఉంటుంది.

 Also Read:Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు 

నిబంధనలకు విరుద్ధం

బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న విక్రాంత్ శర్మ,(Vikrant Sharma) వెంకటకృష్ణ, కృష్ణమూర్తి(Venkatakrishna, Krishnamurthy) నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి(MLC Challa Venkatrami Reddy) సోదరుని కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని కార్యక్రమాలు నిర్వహించడం, ఆశీర్వాదాలు అందజేయడం, పలువురు రాజకీయ పార్టీల నాయకులను కలసిన దృశ్యాలు దినపత్రికలు ఛానల్ లలో ప్రసారమయ్యాయి. క్రమశిక్షణ ఉల్లంఘించిన కారణంగా
ఈ అంశంపై విచారణ జరిపిన అధికారులు, విచారణ పెండింగ్ లో ఉన్న కారణంగా సస్పెండ్ చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయానికి బదిలీ అయిన పురేందర్ స్థానంలో జడ్చర్ల మండలం గంగాపురం దేవాలయ ఈఓగా పనిచేస్తున్న దీప్తికి జోగులాంబ దేవాలయ(Jogulamba Temple) ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Bigg Boss 9 Contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి అడుగు పెట్టిన మొత్తం కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!