Congrats to Hydraa: ప్రజావసరాలకు ఉద్దేశించిన స్తలాలను కాపాడిన హైడ్రాకు కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్కిల్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీ నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వగానే చర్యలు చేపట్టిన హైడ్రా(Hydraa)కు అభినందనలు తెలిపారు. భగత్‌సింగ్ నగర్(Bhagat Singh Nagar) నుంచి వందలాదిగా తరలి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) గారిని కలసి అభినందనలు తెలిపారు. ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసిన సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 3500ల గజాల స్థలం కాగా.. వెయ్యి గజాలకు పైగా కబ్జా అయ్యిందని వాపోయారు. హైడ్రా(Hydraa) రంగంలోకి దిగకపోతే మొత్తం కబ్జాలపాలయ్యేదని అన్నారు. ఇటీవల వచ్చిన నిర్మాణాలను తొలగించి మొత్తం 3500ల గజాల స్థలాన్ని కాపాడి ఫెన్సింగ్ వేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Also Read: Asia Cup squad: ఆసియా కప్‌కు ఎవరూ ఊహించని ప్లేయర్ దూరం!
వాటిపై ప్రత్యేక శ్రద్ద వహించడం
హైడ్రా చేస్తున్న పనులకు ప్రజలనుంచి విషేశ స్పందన లభించింది. హైద్రబాద్‌లో అక్రమాలు చేయడానికి కొందరు భడా బాబులు సైతం బయపడుతున్నారు. పట్టణంలోని చెరువులు, నాళాలు కబ్జాలకు గురి కాకుండా వాటిపై ప్రత్యేక శ్రద్ద వహించడం, అక్రమ కట్టడాలు కట్టకుండా కాపాడుతుంది. నగరంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిచే పనిని కూడా తీసుకుంది. హైడ్రా డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నారు. కల్వర్టులు, క్యాచ్‌పిట్లు, వరద కాలువల వద్ద లారీల కొద్దీ పూడిక బయట పడుతోంది. అల్వాల్‌లోని బృందావన్ కాలనీ కల్వర్టులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, సిల్ట్‌ను తొలగించడంతో వరద నీరు సాఫీగా వెళ్తోంది. అక్రమ కట్టడాలే కాకుండా, వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా తన పనులను చేసుకుంటుంది.
Also Read: BHEL Recruitment 2025: రూ.60,000 భారీ జీతంతో BHEL లో భారీ ఉద్యోగాలు..