Bad News For Darling Fans
Cinema

Salaar Movie: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్

Bad News For Darling Fans: పాన్ ఇండియా స్టార్ డార్లింగ్‌ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది సలార్ మూవీతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి టాక్‌ను రాబట్టుకుంది కానీ అనుకున్న కలెక్షన్స్‌ని మాత్రం అందివ్వలేకపోయింది. కెజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీరోల్‌ పోషించిన ఈ మూవీలో నటి శృతిహాసన్ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.

ఇక సలార్ సీజ్ ఫైర్‌లో స్టోరీ మొత్తాన్ని చూపించలేదు. అసలు సిసలు కథ శౌర్యంగ పర్వంలో ఉండనుందని మేకర్స్ తెలిపారు. దీంతో ఎప్పుడెప్పుడు సలార్ 2 సెట్స్ మీదకు వెళ్తుందా..? ఎప్పుడెప్పుడు శౌర్యంగ రాజుగా ప్రభాస్ కనిపిస్తాడా..? అని ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.అయితే అంతలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్, సలార్ 2 ఆగిపోయింది. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, డార్లింగ్‌ ప్రభాస్ మధ్య క్లాషెస్ రావడంతో సలార్ 2 ను ఆపివేసినట్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క రాజాసాబ్‌ను కూడా పూర్తిచేస్తున్నాడు.

Also Read:విశ్వంభరలోకి అందాల నటి ఎంట్రీ..? 

ఈ రెండు సినిమాలు పూర్తి చేసి సలార్ 2 లో అడుగుపెట్టాలన్నది ప్రభాస్‌ ప్లాన్. ప్రభాస్ సినిమాలు అయ్యేలోపు ప్రశాంత్ నీల్ సలార్ 2 స్క్రిప్ట్ ను రెడీ చేసి వెంటనే షూట్‌కు వెళ్లిపోవాలనుకున్నాడు. ఎన్టీఆర్ 31 కూడా సలార్ 2 తరువాతనే మొదలుపెట్టాలని అనుకున్నారట. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ 31..విరిద్దరి క్లాషెస్‌ వల్ల ఆగస్టు నుంచే మొదలుకానుందట. సలార్ 2 ను పక్కన పెట్టి నీల్ తన ఫోకస్ అంతా ఎన్టీఆర్ 31 మీద పెట్టనున్నాడని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే వారిద్దరు రియాక్ట్ అయ్యే దాకా అసలు మ్యాటర్ తెలియదు.

Just In

01

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!