Hyderabad District Collector: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలకు బ్యాంకులను తగిన ప్రాధాన్యనిస్తూ సకాలంలో మంజూరు చేయాలని హైదరాబాద్(Hyderabad) జిల్లా కలెక్టర్ హరిచందన(Harichendhana) దాసరి బ్యాంకులకు సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన డీసీసీ(DCP), డీఎల్ఆర్సీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యా రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అదే ప్రభుత్వ లక్ష్యమని, కోటి మంత్రి మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.
మత్స్యకారులకు అవగాహన
సూక్ష్మ(Micro), చిన్న(Small), మధ్య(Mediam) తరహ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ఆమె బ్యాంకు అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం విధివిధానాలు సంబంధిత శాఖ ద్వారా మత్స్యకారులకు అవగాహన కల్పించాలని, పీఎం విశ్వకర్మ పీఎం స్వనిధి, ముద్రా(Mudhra), అలాగే స్టాండ్ అప్ ఇండియా రుణాలు ఎక్కువగా అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2025-26 ప్రకారం వివిధ రంగాలలో రూ. 420682.07 కోట్లు రుణాల లక్ష్యం ఉండగా, మొదటి త్రైమాసింలో (జూన్ 2025) రూ. 147528.83 కోట్లు (35.07శాతం ) రుణాలు ఇవ్వడం జరిగిందని వివరించారు.
Also Read: Chakradhar Goud: కోవర్ట్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా?
ప్రణాళిక ప్రకారం రుణాలు మంజూరు
ఇందులో ఎంఎస్ఎంఈ(MSME) రుణాల లక్ష్యం రూ. 115649.26 కోట్లు ఉండగా, రూ. 36779.17 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రాధాన్యత రంగాల రుణాల లక్ష్యం రూ. 121798.10 కోట్లు ఉండగా, రూ. 41585.36 కోట్లు (34.14 శాతం) మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రణాళిక ప్రకారం రుణాలు మంజూరు చేస్తున్నందున బ్యాంకర్స్(Bankers) ని అభినందిస్తూ , ప్రాధాన్యపరంగా రుణాలను ఎక్కువ ఇవ్వాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఎల్డీఓ ఆర్బీఐ లక్ష్మి శ్రావ్య, డీడిఎం నాబార్డ్ హర్ష రఘురాం, ఎల్డీఎం నరసింహ మూర్తి, వివిధ వాణిజ్య, సహకార, బ్యాంకుల కంట్రోలర్స్, జీఎం ఇండస్ట్రీ పవన్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారులు జి. ఆశన్న, కోటజీ, ప్రవీణ్ కుమార్, డాక్టర్ రమేష్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Save Singareni: తెలంగాణ బొగ్గుగని ఉద్యమ బాట.. 11 డివిజన్లలో నిరసనలు ధర్నాలు