Chakradhar Goud: సిద్దిపేటలో రౌడీ రాజ్యం నడుస్తుందని, మైనంపల్లికి సిద్దిపేటతో ఏం సంబంధం ఉందని వందల మందితో సిద్దిపేట(Sidhipeta)కు వచ్చి భూ దందాలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ గౌడ్(Chakradhar Goud) అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్(Congress) పార్టీలో మైనంపల్లి లాంటి నాయకులు తన లాంటి బీసీ(BC) లీడర్లను ఎదగకుండా తొక్కేస్తున్నారని అన్నారు. పార్టీలోని కోవర్ట్ రాజకీయాలు భరించలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం తన పై పెట్టిన ఫేక్ కేసులను, కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే ఇప్పుడు సోషల్ మీడియా లో పెడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని అన్నారు.
ఎక్కడ అడుగు పెడితే అక్కడ
పార్టీలో తనతో పాటు తిరుగుతున్న వారికి ఏ ప్రభుత్వ పథకాలను అందకుండా చేస్తున్నారని, తాను ఏ రోజు పదవులను ఆశించకుండా పార్టీ కోసం కష్టపడ్డానని, అలాంటి తనను వ్యక్తిగతంగా తన తల్లి పేరుతో మైనంపల్లి(Mynam Pally) దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తండ్రి కొడుకులు కేటీఆర్(KTR) కాళ్లు మొక్కి ఆయనను తిట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్(Revanth Reddy)డి కాళ్లు మొక్కుతున్నారని, అవసరం తీరితే ఆయన ను కూడా తిడతారన్నారు. మైనంపల్లి ఎక్కడ అడుగు పెడితే అక్కడ డీసీసీ(DCC) లు రాజీనామా చేస్తున్నారని, ఆయన చెప్పినట్టు వినకపోతే వాళ్లంతట వాళ్లే పార్టీలో నుండి వెళ్లేలా పుల్లలు పెడుతున్నాడని అన్నారు సిద్దిపేట పట్టణంలో సర్వే నెంబరు 2000 లో బిఆర్ఎస్(BRS) లీడర్ ఆలకుంట మహేందర్ రైతుల భూమిని కబ్జా చేస్తే అలాంటి అతన్ని కూడా పార్టీలోకి తీసుకొని, అతనికి సపోర్ట్ చేస్తూ, నిజమైన అర్హులైన వారికి అన్యాయం చేయడం దారుణం అన్నారు.
Also Read: TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు.. నిర్మాత వివరణ
నాయకులకు విలువ లేదు
మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు డబ్బులు పొతే కేసు పెడితే కూడా చలనం లేని పోలీసులు, కబ్జా స్థలం విషయంలో నిజమైన పట్టదారులు గోడను కూలిస్తే కేవలం 2 గంటల్లో డబ్బులు, బంగారం దొంగిలించారని కేసు ఎలా చేశారని అన్నారు. పార్టీలో నిజమైన కాంగ్రెస్ నాయకులకు విలువ లేదని, బిఆర్ఎస్(BRS) నుండి వలస వచ్చిన నాయకులకే పనులు అవుతున్నాయన్నారు. కొద్దీ రోజుల్లోనే మైనంపల్లి తీరు వల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కాళీ అయితుందని, మైనంపల్లి సిద్దిపేట జిల్లా లో ఎన్ని సర్పంచ్, ఎంపీటిసి(MPTC), జడ్పీటీసీ(ZPTC) లు గెలిపిస్తారో చెప్పాలని అన్నారు. కబ్జా కోరులకు వత్తాసు పలికిన సిద్దిపేట వన్ టౌన్ సీఐ(CI) ని కోర్ట్ లో నిలబెడుతానన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే డబ్బులు అడుగుతున్నారని, సీఎం సిద్దిపేట మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టి ఇక్కడి ఇంఛార్జీని మారిస్తే తప్ప పార్టీ బాగుపడదు అన్నారు.
Also Read: CPM: కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం: సాదుల శ్రీనివాస్
