Viral Video: చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్ కు చెందిన ఓ వ్యక్తి తన కారును అక్వేరియంలా మార్చి.. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. కారు ముందు ఉన్న బానెట్ పై చేపలు కదలడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారు యజమానికి వచ్చిన విచిత్రమైన ఆలోచనకు ఫిదా అవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
లియోనింగ్ ప్రావిన్స్‌కి చెందిన ఓ వ్యక్తి తన Li Auto L9 SUV కారును అక్వేరియంలా మార్చివేశాడు. కారు బానెట్ పై గట్టిగా ఉంటే ప్లాస్టిక్ ఫిల్మ్ ను ఏర్పాటు చేసి అందులో జీవం ఉన్న చేపలను పెట్టాడు. అయితే తొలుత ఈ వీడియోను చూసిన చాలామంది ఏఐ అని భావించి.. కొట్టిపారేశారు. తీరా కారు బానెట్ పై ఉన్న చేపలు ఒరిజినల్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ‘చేపలను అలా ఎలా పెట్టావ్ బ్రో’ అంటూ యజమానిని ప్రశ్నిస్తున్నారు.
కారు యజమాని ఏమన్నారంటే?
కారును అక్వేరియం మార్చడంపై యజమాని ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ‘మేము చేపలు పట్టడానికి వెళ్లాము. కానీ చేపలు భద్రపరిచే కంటైనర్ మర్చిపోయాం. కాబట్టి కారు బానెట్ లో పెడితే ఎలా ఉంటుందని అనిపించింది’ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే కొందరు నెటిజన్లు అతడి సృజనాత్మకతను మెచ్చుకుంటున్నప్పటికీ మరికొందరు తప్పబడుతున్నారు. తక్కువ నీటిలో చేపలను ఉంచడం జంతు హింసకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.
Also Read: Indian Railways: ఛీ ఛీ మీరు మనుషులేనా.. యువతికి సాయం చేయకపోగా నవ్వుతారా?
ట్రాఫిక్ పోలీసుల అభ్యంతరం
ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా కారును మోడిఫైడ్ చేయడంపై అధికారులు అభ్యంతరం తెలియజేశారు. ఈ అక్వేరియం కారును చట్టవిరుద్దమని ప్రకటించారు. ఈ వాహనం పబ్లిక్ రోడ్లపై నడవడానికి పూర్తిగా అనర్హమని ప్రకటించారు. యజమాని ‘ఫిష్ ట్యాంక్ ఫాంటసీ’ని తీవ్రంగా తప్పుబట్టారు. జంతువులు అలంకార వస్తువులు కాదని.. మనలాగే ప్రాణం ఉన్న జీవులను పేర్కొన్నారు.
Man Turns SUV Hood Into Aquarium, Leaves Fish to Die, Internet Horrified pic.twitter.com/S3qHq8l0c2
— Shruti (@ShrutiSneha25) July 28, 2025