Gadwal district: రైతే దేశానికి వెన్నెముక రైతు లేనిదే రాజ్యం లేదు అంటారు. కానీ రైతులు(Farmers)మాత్రం పంటలు పండించాలంటే అరిగోస పడుతున్నారు. అసలే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో రైతులు(Farmers) ఒకటికి రెండుసార్లు గింజలు నాటుకునే పరిస్థితి తలెత్తింది. అయినా వర్షాలు సరిగా కురియకపోవడంతో గింజలు సరిగా మొలవలేదు. కాస్తో కూస్తో మొలిచిన మొక్కలకు ఎరువులు వేసి కాపాడుకుందామంటే యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
❄️ఒకరికి ఒకటి నుంచి మూడు బస్తాలే
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో వ్యవసాయ పంటలకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు 15 వేల మెట్రిక్ టన్నుల అవసరం లాగా ఇప్పటివరకు 11 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడుపోయింది ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా మరో 2500 మెట్రిక్ టన్నుల అవసరం కానుంది. రైతుల(Farmers)కు ఎన్ని ఎకరాలు ఉన్న ఒకరికి నెలకు రెండు బస్తాల యూరియానే ఇస్తున్నారు. రైతుకు(Farmers) ఇంకా యూరియా కావాలంటే మరో 10 రోజుల తర్వాత రామని అధికారులు చెప్పే పరిస్థితులు నెలకొన్నాయి. ఇచ్చే ఒకటి నుంచి మూడు బస్తాల కోసం రైతులు పనులు మానుకొని సహకార సంఘాల వద్ద ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్నారు. అయినా యూరియా బస్తాలు వచ్చేసరికి సాయంత్రం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
❄️సహకార సంఘాల్లోనే యూరియా బస్తాలు..
ఒకరికి ఒక బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండడంతో రైతుల యొక్క ఆధార్ కార్డు, భూమి పట్టా పాస్బుక్ జిరాక్స్లతో సహకార సంఘాల వద్ద బారులు దీరుతున్నారు. దీంతో రైతులు(Farmers) సహకార సంఘాల కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. రైతులు తమ గ్రామం దాటి కనీసం ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సంఘాల వద్దకు వెళ్లి యూరియా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
❄️నానో యూరియా వాడాలి : సక్రియ నాయక్ జిల్లా వ్యవసాయ అధికారి
రైతులు(Farmers) మోతాదుకు మించి యూరియా వాడుతున్నారు. ఈ పద్ధతిని నియంత్రించడానికి యూరియా(Urea) బస్తాల పంపిణీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. రైతులు(Farmers) సంప్రదాయబద్ధంగా యూరియా(Urea) వాడకం తగ్గించి నానో యూరియా ఎకరాకు 500 మి.లీ. వాడితే మంచి ఫలితాలు ఇవ్వడమే కాకుండా రైతులకు పెట్టుబడి భారం కూడా తగ్గుతుంది.
❄️1.ప్రభుత్వం యూరియాను అందుబాటులో ఉంచాలి : వీరన్న, బసల్ చెరువు గ్రామం ప్రస్తుతం వరి పంటను సాగు చేస్తున్నామని, మొక్క ఎదుగుదలకు యూరియా(Urea) ఉపయోగపడుతుందని రైతు వీరన్న తెలిపారు. బయట దుకాణాలలో యూరియా(Urea) దొరకకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతుల(Farmers) సమస్యలను పరిష్కరించాలన్నారు.
❄️2. ఎకరాకి ఒకటే ఇస్తున్నారు : చంద్రన్న చేనుగోనిపల్లి, గద్వాల(Gadwala) మండలం వర్షాకాలంలో వరి,పత్తి పంట పండిస్తున్నాం. ఎకరాకి కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. ఉదయం నుంచి ఆఫీస్ కాడ పడిగా పులు కాసి టోకెన్ తీసుకొని పోవాల్సి వస్తోంది.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా