Viral Video: క్రూర మృగాలు ఎంతో ప్రమాదకరమైనవి. అవి ఎప్పుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయో ఊహించడం చాలా కష్టం. కాబట్టి వన్య ప్రాణుల తారసపడినప్పుడు జాగ్రత్తగా ఉండటం ఏంతో ముఖ్యం. వాటి ముందు ఏమాత్రం అత్యుత్సాహం ప్రదర్శించినా అవి ప్రాణాల మీదకు తీసుకురావొచ్చు. అయితే దీనికి అద్దం పట్టే ఘటన తాజాగా కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకుంది. ఓ ఏనుగు విషయంలో ఓ పర్యాటకుడు అత్యుత్సాహం ప్రదర్శించి.. తన ప్రాణాలను ప్రమాదంలో పడేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ (Viral Video) అవుతున్నాయి.
వీడియోలో ఏముందంటే?
కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్ (Bandipur Tiger Reserve) గుండా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కేరళ (Kerala)కు చెందిన ఆ పర్యాటకుడి పైకి దంతాలున్న అడవి ఏనుగు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఏనుగు ముందు పరిగెడుతూ అతడు కిందపడిపోయాడు. ఆ వేగంతోనే ఏనుగు కాళ్లతో అతడ్ని తన్నుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. అతడి శరీరంపై ఏనుగు కాలు వేయకపోవడంతో గాయాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అత్యుత్సాహం ప్రదర్శించిన పర్యాటకుడిపై దాడి చేసిన ఏనుగు
కర్ణాటక – బందీపూర్ టైగర్ రిజర్వ్ లో వాహనం నుండి దిగి, ఏనుగు ముందు నిల్చున్న కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
ఏనుగు దాడి చేయగా, స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్న పర్యాటకుడు pic.twitter.com/A2SNBZDIl2
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2025
అత్యుత్సాహం ప్రదర్శించి..
దాడికి ముందుకు సదరు వ్యక్తి ఏనుగుకు అతి సమీపంగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఏనుగును రోడ్డుపై చూసిన వాహనదారులు.. ఎక్కడికక్కడ ఆగిపోయారు. పలువురు దూరంగా నిలబడి ఏనుగును చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో బాధితుడు అత్యుత్సాహం ప్రదర్శించి ఏనుగుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసినట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఏనుగు ఒక్కసారిగా అతడి వైపునకు దూసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. గాయపడిన బాధితుడ్ని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: India on Pak Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ కారు కూతలు.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన భారత్!
గతంలోనూ ఇంతే..!
కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్.. వన్యప్రాణి కారిడార్ గా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ మార్గం గుండా వెళ్లేవారికి ఏనుగులు తారసపడటం సాధారణంగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో ఏనుగులు.. స్థానికులపై దాడి చేసి ప్రాణా నష్టానికి కారణమైన ఘటనలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చామరాజనగర్ జిల్లాలోని నేషనల్ పార్కులో ఇద్దరు వ్యక్తులపై ఏనుగు దాడికి యత్నించింది. వారు ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 2023 డిసెంబర్‌లో టైగర్ రిజర్వులోని కుందకేరే పరిధిలో కొంతమేర తిన్న మానవ మృతదేహం కనిపించింది. ఆ నెలలో ముగ్గురు వ్యక్తులు పులిదాడిలో మరణించడం గమనార్హం.