Palem Project Reservoir: చత్తీస్గడ్ రాష్ట్రం నుండి వరద రూపంలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వెంకటాపురం మండలం లో రెండు గుట్టల నడుమ వాగు ప్రవహించేది. చత్తీస్గడ్(Chhattisgar) రాష్ట్రం నుంచి తెలంగాణ(Telangana) రాష్ట్రం మీదుగా భూపతిపాలెం వద్ద గోదావరి నదిలో వరద నీరంతా వృధాగా పారుతుంది. విషయాన్ని గమనించిన 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రె(Congress)స్ వైయస్సార్(YSR) హయాంలో పాలెం వాగుకు రిజర్వాయర్(Palem Vaguku Reservoir) ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలోకి వస్తే వాజేడు వెంకటాపురం మండలాలకు సంబంధించిన ఆదివాసి రైతుల వ్యవసాయ భూములు దాదాపు 10132 ఎకరాలకు నీరు అందించవచ్చని 2005లో వృధాగా పా జలాలకు అడ్డుకట్ట వేసేలా నిర్మాణానికి ప్రణాళికలు రచించారు. ఇందుకు ఎస్టిమేషన్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ప్రాజెక్టు ఆకృతిని అధికారులు రూపొందించారు.
మొదట రూ. 47.95 కోట్లతో
చత్తీస్గడ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మండలం వెంకటాపురం లో రెండు గుట్టల మధ్య నుంచి పారుతున్న పాలెం వాగును రిజర్వాయర్ గా నిర్మాణం చేయాలని లక్ష్యంతో రూ. 47. 95 కోట్లతో ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రతిపాదనను పంపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం కేవీఆర్(KVR), ఏఎల్ఎస్(ALS) సంయుక్తంగా పనిచేసే కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. అయితే నీటిని అంచనా వేయడంలో విఫలమైన అధికారుల చర్యలతో 2006, 2008లో రెండుసార్లు ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడే తెగిపోయింది.
తిరిగి ఆకృతిని మార్చి 2010లో
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసి రైతులకు వ్యవసాయం చేసుకునేలా ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి వృధాగా గోదావరి నదిలోకి వెళ్తున్న నీటిని నిల్వ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని లక్ష్యంలో భాగంగా తిరిగి పాలెం ప్రాజెక్టు ఆకృతిని 2010లో 4 రేడియల్ గేట్ల సర్వీసుతో రూ. 81.06 కోట్లతో నిర్మాణ వ్యయాన్ని పెంచారు. మొదట నిర్మాణం చేపట్టదలచిన సంస్థకే మళ్లీ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. కానీ నిర్మాణ పనుల జాప్యంతో రూ. 226. 47 కోట్లతో మళ్లీ ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ సంతరించుకుంది.
Also Read: Bandi Sanjay: కవితకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి: బండి సంజయ్
రూ. 204.46 ఖర్చు చేసిన సగం ఆయకట్టుకు
వాజేడు, వెంకటాపురం మండలాల ఆదివాసి రైతులకు సంబంధించిన 10132 ఎకరాల కు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన పాలెం ప్రాజెక్టు రూ. 204. 46 కోట్లు ఖర్చు చేసిన అంచనా పారకానికి 10132 ఎకరాలకు గాను సగం అంటే 4700 ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గేట్లను అమర్చారు. 2017 అక్టోబర్ 2న అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) చేతుల మీదుగా ప్రారంభించి మన్యం రైతులకు అంకితం చేశారు. అయితే అప్పటికే కొన్ని పనులు మిగిలిపోవడంతో వాటిని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2018 మార్చి నుంచి పనులు మాత్రం నేటి వరకు జరగలేదు. వానాకాలంలో 4700 ఎకరాలు, దాల్వ (యాసంగి) 2200 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నట్లుగా అధికార గణాంకాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వారకం లేదని రైతులు వెల్లడిస్తున్నారు.
కాలువ నిర్మించారు కానీ
పాలెం ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత పెద్ద కాలువ 13 కిలోమీటర్ల మేర నిర్మాణం చేశారు. కానీ లోతు ఉండడం వల్ల నీరంతా వృధాగా కిందికి వెళ్లిపోతున్నాయని రైతులు(Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లోతును తగ్గించి ఎత్తు పెంచితే బోర్లకు నీరందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో వానొస్తే పండుతాయని, లేదంటే ఎండుతాయని, దాల్వా పంట కైతే మరీ ఘోరంగా నీళ్లందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు నాలుగు గేట్లను నిర్మించినప్పటికీ డిస్ట్రిబ్యూటరీలు సరిగ్గా పనిచేయకపోవడంతో లీకేజీ కారణంగా మీరంతా కిందకు వృధాగా వెళుతుందని రైతులు వెల్లడిస్తున్నారు.
పెద్ద కాలువతో పాటు పిల్ల కాలువలు నిర్మించి 18 కిలోమీటర్ల వరకు అనుసంధానంగా నిర్మాణం చేయకపోవడంతో సేద్యం చేసుకునే రైతులకు సాగునీరు అందడం లేదని వెల్లడిస్తున్నారు. అయితే లోతుగా ఉన్న కాలువకు అనుసంధానంగా త్రీఫేస్ కరెంట్ లైన్ మంజూరు చేస్తే పరిసర ప్రాంత రైతుల వ్యవసాయానికి నీరు అందుతుందని రైతులు భావిస్తున్నారు.
Also Read: Bandi Sanjay: కవితకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి: బండి సంజయ్