Himayat sagar (imagecredit:swetcha)
తెలంగాణ

Himayat sagar: నిండుకుండలా జంట జలాశయాలు.. పోటెత్తిన వరద

Himayat sagar: గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఇరుగు పొరుగు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్(Usman Sagar), హిమాయత్ సాగర్(Himayat Sagar) జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. మహానగరవాసుల దాహర్తిని తీర్చే ఈ జంట జలాశయాల్లో హిమాయత్ సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరటంతో అధికారులు మొత్తం నాలుగు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా మూసీ నది పరివాహాక ప్రాంతానికి వరద ఉద్ధృతి పెరిగింది. గురువారం రాత్రి పది గంటలకు తొలుత ఒక గేటును ఎత్తి నీటిని విడుదల చేసిన జలమండలి అధికారులు రాత్రంతా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి, నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరటంతో శుక్రవారం ఉదయ మరో మూడు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం

హిమాయత్ సాగర్(Himayath Sagar) నుంచి రాజేంద్రనగర్(Rajendra Ngara), అత్తాపూర్(Athapur) ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జలమండలి, రెవెన్యూ(Revenue), పోలీసు(Police) అధికారులు అప్రమత్తం చేశారు. ఈ రెండు జలాశయాలకు ఎగువ ప్రాంతాలైన శంకర్ పల్లి(Shankar Pally), వికారాబాద్(Vikarabad), చేవెళ్ల(Chevella), తాండూరు(Thandur), అనంతగిరి(Anantha Giri Hills) హిల్స్ వంటి ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావటంతో జలాశయాల్లోని నీటి మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి.

హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు ( 2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1763.15 కి చేరటంతో పాటు ఇన్ ఫ్లూ 1300 క్యూసెక్కులుగా నీరు రావటంతో నాలుగు గేట్లను తెరిచి 2070 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పరివాహాక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Also Read: Gadwal district: వర్షాకాలంలో సూర్యుడి భగ భగలు.. వాన కోసం రైతన్నల ఎదురుచూపులు

జలాశయాల్లోకి వస్తున్న వరద

మరో జలాశయం ఉస్మాన్ సాగర్(Usman Sagar) జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు( 3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1783.30 అడుగులకు చేరటంతో జంట జలాశయాలు నిండు కుండల్లా దర్శనమిస్తున్నాయి. 400 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుంది. రెండు జలాశయాల్లోకి వస్తున్న వరద నీటి ఇన్ ఫ్లోను జలమండలి(Water Board) అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. జలాశయాల నుంచి విడుదలైన నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాలైన నయాపూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

గత సోమవారంతో పాటు గురువారం రాత్రి కూడా సిటీలో భారీ వర్షం కురవటంతో హుస్సేన్ సాగర్(Husen Sagar) లోకి కూడా భారీగా నీరు వస్తున్నట్లు జీహెచ్ఎంసీ(GHMC) ఇంజనీర్లు గుర్తించి, పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా, గరిష్ట స్థాయి నీటి మట్టం 514.75 కాగా, ప్రస్తుత నీటి మట్టం 513.63 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Tribal Girls Ashram School: గిరిజన విద్యార్థినులపై ఎమ్మెల్యే అపార శ్రద్ధ.. అన్నీ తానై!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు