Tribal Girls Ashram School (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Tribal Girls Ashram School: గిరిజన విద్యార్థినులపై ఎమ్మెల్యే అపార శ్రద్ధ.. అన్నీ తానై!

Tribal Girls Ashram School: ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఎస్టీ(ST) గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉదయం అల్పాహారం అనంతరం విద్యార్థినిలు అస్వస్థతకు గురైన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Matta Ragamayi Dayanand) తక్షణం స్పందించారు. వైద్య నిపుణురాలిగా విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించి, అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రత్యేక శ్రద్ధ
విషయం అందిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అక్కడ చేరిన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ప్రతి ఒక్కరిని విడిగా పరిశీలించారు. వాంతులు, కడుపునొప్పి(Stomach ache), శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థినులపై వైద్య సిబ్బందిని సమీక్షించి, తగిన సూచనలు జారీ చేశారు. వైద్య పరీక్షల ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి, సీరియస్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఆహార నాణ్యతపై కఠినంగా స్పందన
అనంతరం హాస్టల్‌(Hostel)కు వెళ్లి, అక్కడ వండిన అల్పాహారాన్ని పరిశీలించారు. వంట గదిలో ఉన్న పరిస్థితులను స్వయంగా తనిఖీ చేసి, రోగ నిరోధకతకు ముప్పుగా ఉన్న పరిస్థుతులపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తట్టుకోలేనిది అని ఘాటుగా పేర్కొని, ఇందులో

అశుద్ధత, బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Also Read: Hydraa: మూసీ సుందరీకరణతో మాకు సంబంధం లేదు: హైడ్రా

ప్రత్యక్షంగా తల్లిలా
విద్యార్థినుల పట్ల చూపిన శ్రద్ధ, సానుభూతి ప్రజల మన్ననలు పొందుతోంది. పసిపిల్లల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులతో చర్చించి, హాస్టల్ సిబ్బందికి బాధ్యతను గుర్తు చేశారు. విద్యార్థినులకు క్రమితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆహార సరఫరాలో నాణ్యత ప్రమాణాలను అమలు చేయాలని అన్నారు. వంట గదిలో పారిశుధ్య నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలియచేశారు. తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో ఆరోగ్య సమాచారం అందించాలని అన్నారు.

నమ్మకాన్ని నిలబెట్టిన నాయకత్వం
ఈ ఘటనలో డాక్టర్ మట్టా రాగమయి(Matta Ragamayi Dayanand) వ్యవహరించిన తీరు ప్రజల విశ్వాసాన్ని పెంచింది. వైద్య నిపుణురాలిగా, ప్రజాప్రతినిధిగా చూపిన బాధ్యతాయుత చర్యలు, బాధ్యతారాహిత్యంపై తీసుకున్న నిశ్చయాత్మక వైఖరి సామాజికంగా ప్రశంసించదగ్గవని ప్రజలు ఆమేను ప్రశంసించారు.

Also Read: Viral News: భారతీయులు విదేశాలకు వెళ్తే వెనక్కి రానిది అందుకేనా!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?