Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధంలేదని కేటీఆర్ తన కుటుంబం, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ప్రమాణం చేసే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ట్యాపింగ్ జరిగిందని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమని, తాను కూడా ఏ గుడికి అంటే ఆ గుడికి తన కుటుంబంతో సహా వస్తానని, కేటీఆర్(KTR) వస్తారా? అని సవాల్ విసిరారు. కేటీఆర్(KTR) కు ఆలయంపై నమ్మకం లేదంటే మసీద్(Mosque), చర్చి(Cherch)కైనా వెళ్దామని, ప్రమాణానికి సిద్ధమా అని, తన సవాల్ కు కేటీఆర్ స్పందించాలని బండి కోరారు. పౌర్ణమిని పురస్కరించుకుని కరీంనగర్(Karimnagar) లో బండి సంజయ్ తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి రాఖీలు కట్టారు. అనంతరం బండి మీడియాతో మాట్లాడారు.
ఆయనకు నోటీసులిస్తారా
తాను ఏం తప్పు చెప్పానని కేటీఆర్ లీగల్ నోటీసులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు ఆయన చెల్లి కవిత కూడా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) జరిగిందని చెప్పారని బండి గుర్తుచేశారు. ఆమెకు లీగల్ నోటీసులిస్తారా? అని బండి ప్రశ్నించారు. రాధాకిషన్ రావు(Radha Kisha Rao) తన వాంగ్మూలంలో పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారని పేర్కొన్నారు. ఆ విషయం కోర్టులో ఉందని, ఆయనకు నోటీసులిస్తారా అని బండి(Bamdi Sanjey) ప్రశ్నించారు. అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే కేసీఆర్, ఆయన కొడుకు ఎప్పటికీ జైల్లోనే ఉంటారన్నారు. వాళ్లు తిట్టని తిట్లు లేవని, మాట్లాడని బూతుల్లేవని, చేయని తప్పులు లేవన్నారు. జరపని అవినీతి లేదన్నారు. నోటీసులిస్తే.. ఏం చేయాలో తనకు తెలుసని, అంతకంటే నోటీసులు ఎక్కువ తన వద్ద ఉన్నాయన్నారు. ఒక రాజకీయ నాయకుడివై ఉండి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీసులతో బెదిరించాలనుకోవడం అంతకంటే మూర్ఖత్వం లేదని బండి ఎద్దేవాచేశారు.
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ
ఆ నోటీసులకు తాను ఏమాత్రం భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tappng) అవ్వలేదని హరీష్ రావు(Harish Rao) ప్రమాణం చేయగలరా? అని బండి ప్రశ్నించారు. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలన్నారు. ఎందుకంటే ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు(MLAS), ఎమ్మెల్సీ(MLCS)లుసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. అయినా వారు ఇంకా ఎలా బీఆర్ఎస్ లో ఉంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ(CBI) విచారణ జరిపించాలనే విషయంలో మాకు స్పష్టత ఉందని, ఎందుకంటే సిట్ పరిమితి చాలా తక్కువ అని బండి సంజయ్ తెలిపారు. మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖుల, సినీ తారల, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడ్డారని బండి ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. ఈడీ మాత్రమే విచారణ చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు.
Also Read: Bjp Ramchander Rao: ఇటు పార్టీ.. అటు ప్రజా సమస్యలు.. ఒకే సమయంలో రెండింటిపై ఫోకస్
జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్
అట్లాగే టెలికం రెగ్యులేటరీ అథారిటీ(Telecom Regulatory Authority) నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్(KTR) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిందని, ఇది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశమన్నారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ పోలీసులు ఆధారాలతోసహా వెల్లడించారని, జడ్జీలకు నోటీసులిచ్చి పిలిచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసే అధికారం సిట్ కు ఉందా? అని బండి ప్రశ్నించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. నిఘా వ్యవస్థలపై బండి సంజయ్ కు అవగాహనే లేదని, ఆయన కేంద్ర మంత్రి ఎట్లా అయ్యారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ లా తనకు కొంపలు ముంచే తెలివి లేదని ధ్వజమెత్తారు. బెంగాల్ లో మమతా బెనర్జీ వద్దకు పోయి కేసీఆర్ డబ్బులు పంచేందుకు సిద్ధమైతే.. మమతా బెనర్జీ.., కేసీఆర్ ను గుర్తు పట్టకపోతే ఇబ్బంది పడ్డది నిజం కాదా? అని ఎద్దేవాచేశారు. తాను వ్యక్తిగత విషయాలకు పోవద్దని ఆలోచిస్తున్నానని, లేదంటే కేటీఆర్ బండారమంతా బయటపెట్టేవాడినని హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు
రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, ‘మీ పదేండ్ల అవినీతికి మేము రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష’ అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు అవినీతి, దోపిడీలకు రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నారని బండి విమర్శలు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల మధ్యనున్న ‘రక్షా’ బంధమే కారణమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ లో చర్చించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ నివేదికను కేబినెట్ లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున వాటాలు ముట్టినందునే ఆ కమిషన్ నివేదిక గురించి కనీసం పెదవి కూడా విప్పడం లేదని అన్నారు.
Also Read: Minister Sridhar Babu: పెట్టుబడులే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం