Minister Sridhar Babu
తెలంగాణ

Minister Sridhar Babu: పెట్టుబడులే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం

Minister Sridhar Babu: శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని, 562 కోట్లతో తోషిబా విద్యుత్ పరికరాల రెండు యూనిట్లను ప్రారంభించి, మరో యూనిట్‌కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.

ఈ సందర్భముగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులే లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తోషిబా విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమలో ప్రారంభించిన ఈ యూనిట్ల ద్వారా 400 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

అనతి కాలంలోనే తెలంగాణ తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా మారింది. 2024 -25 లో ఇండస్ట్రియల్ అవుట్ పుట్ రూ.2.77 లక్షల కోట్లు. ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదే. 9 నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన మార్చండైజ్ ఎక్స్ పోర్ట్స్ రాష్ట్రం నుంచి జరిగాయి. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.2 శాతం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే సంకల్పంతో క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025 ను తీసుకొచ్చాం. ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాం. 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20వేల మెగా వాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు.

Also Read- Singer Madhu Priya: చెల్లెలి పెళ్లి వేడుకల్లో సింగర్ మధుప్రియ.. ఫ్యామిలీ అంతా కలిసిపోయారా?

ఈ ఏడాది 2025 ఏప్రిల్ మాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సందర్భంగా చేసుకున్న అవగాహన ప్రకారం కొత్త ప్లాంట్ ప్రారంభం అయిందని, రూ. 562 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తోషిబా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని అన్నారు. బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో ఈరోజు రూ.177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించుకున్నాం. రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ ప్రారంభించుకున్నాం. ఈ పెట్టుబడులతో ఎనర్జీ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా పాలసీని అమలు చేస్తోంది. యువతకు నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహం, ఆధునిక టెక్నాలజీ పరిజ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. పెట్టుబడులకు ఆధునిక ప్రపంచం హైదరాబాద్ అని అన్నారు. టెక్నాలజీ అంటే తెలంగాణ, హైదరాబాద్ అని పేర్కొన్నారు.

పాలసీ పర్ఫామెన్స్‌లో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని, సంగారెడ్డికి రైసింగ్ కారిడార్‌గా రుద్రారం మారుతుందని చెప్పారు. దీర్ఘకాళిక సంబంధాల బలోపేతమే లక్షంగా తెలంగాణతో భారీగా పెట్టుబడులు రాబడుతున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ సెక్టర్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని, తెలంగాణలో పెట్టుబడులకు జపాన్ కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగానే విద్యుత్ పరికరాల తయారీ కంపెనీలు ఉండాలని ఆకాంక్షించారు.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల.. సప్తమి గౌడ కాదండోయ్!

కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ...పరిశ్రమలో నూతన ఉద్యోగాల కల్పన ద్వారా.. కార్మికుల జీవితాల్లో వెలుగులు పంచాలన్నదే తన సంకల్పం అన్నారు. తోసిబాలో ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారని. తద్వారా కార్మికులకు శ్రమ తగ్గుతుందని చెప్పారు. ఈ ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులకు దారితీయనున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ & డెవలప్మెంట్ మంత్రి KYOKO HOKUGO, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ HIROSHI KANETA, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తోషిబా పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు